మునుగోడులో ఓడిపోతామనే భయంతో కేసీఆర్ కొత్త డ్రామాకు తెరలేపారని ఉప ఎన్నిక స్టీరింగ్ కమిటీ ఛైర్మన్ వివేక్ వెంకటస్వామి అన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో బీజేపీకి అసలు సంబంధం లేదన్నారు. ఆ నలుగురు ఎమ్మెల్యేలు బీజేపీకి అవసరం లేదన్నారు. ఈ రోజు లీకైన్ ఆడియోలో మాట్లాడిన వ్యక్తులు టీఆర్ఎస్ మనుషులేనన్నారు. రామచంద్ర భారతి సీఎం కేసీఆర్ కి కోవర్ట్ అని..బీజేపీతో ఆయనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. నిజంగా ఫాంహౌజ్ లో డబ్బు దొరికితే బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
మునుగోడు ప్రచారంలో ఉన్న ఆ ఎమ్మెల్యేలు సడెన్ గా ఫాంహౌజ్ లో ఎలా ప్రత్యక్షం అయ్యారని వివేక్ వెంకటస్వామి ప్రశ్నించారు. కేసీఆర్ కి నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఆ నలుగురు ఎమ్మెల్యేలను రాజీనామా చేపించి ఎన్నికలకు రావాలని కేసీఆర్ కి సవాల్ విసిరారు. మునుగోడులో టీఆర్ఎస్ ఓడిపోతుందనే భయంతోనే కేసీఆర్ ఇలాంటి చిల్లర డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతుందనే భయం కేసీఆర్ కు పట్టుకుందన్నారు. ఒకప్పుడు కేసీఆర్ మాట్లాడితే టీవీల ముందు, యూట్యూబ్ లలో వేలల్లో చూసే వాళ్లని..ఇపుడు ఆ పరిస్థితి లేదని అన్నారు.సీఎం కేసీఆర్ కి మునుగోడు ప్రజలు చెంప చెల్లు మనిపించే విధంగా తీర్పు ఇస్తారన్నారు.