మునుగోడు ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాజకీయ పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలకు పదునుపెడుతున్నాయి. బై పోల్లో గెలుపు కోసం అన్ని పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీ మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ఆ నియోజకవర్గానికి సంబంధించి స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేసింది. బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకట స్వామిని ఆ కమిటీ ఛైర్మన్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. స్టీరింగ్ కమిటీలో మరో 14 మంది సభ్యులుగా వ్యవహరించనున్నారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి. మనోహర్ రెడ్డిని స్టీరింగ్ కమిటీ కో ఆర్డినేటర్గా నియమించారు.
స్టీరింగ్ కమిటీ సభ్యులు
- ఈటల రాజేందర్, ఎమ్మెల్యే
- జితేందర్ రెడ్డి, మాజీఎంపీ
- గరికపాటి మోహన్ రావు, మాజీ ఎంపీ
- విజయ శాంతి, మాజీ ఎంపీ
- దుగ్యాల ప్రదీప్ కుమార్, బీజేపీ స్టేట్ జనరల్ సెక్రటరీ
- స్వామి గౌడ్, మాజీ ఎమ్మెల్సీ
- చంద్ర శేఖర్, మాజీ మంత్రి
- ఎండ్ల లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్యే
- రవీంద్ర నాయక్, మాజీ ఎంపీ
- రాపోలు ఆనంద్ భాస్కర్, మాజీ ఎంపీ
- యెన్నం శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే
- కపిలవాయి దిలీప్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ
- టి. ఆచారి, నేషనల్ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు
- దాసోజు శ్రవణ్