మునుగోడు ప్రచారానికి ఇవాళ సాయంత్రంతో తెరపడనుంది. చివరి రోజు కావడంతో ప్రధాన పార్టీలు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నాయి. సభలు, సమావేశాలు, రోడ్ షోలతో మునుగోడు మరింత హీటెక్కింది. ఎక్కడ చూసినా పండగ వాతావరణం కనిపిస్తోంది. సాయంత్రం 6 గంటల తర్వాత ఎలాంటి ప్రచారం నిర్వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికల నియమావళిని స్ట్రిక్ట్ గా అమలు చేస్తామన్నారు. బల్క్ మెసేజ్ లు, సోషల్ మీడియా ప్రచారాలపైనా నిషేధం ఉంటుందని అధికారులు తెలిపారు.
ఇటు ప్రచారాలతో పాటు ప్రతి ఓటర్ ను టచ్ చేసేలా పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. పర్సనల్ గా ఫోన్లు, SMSలు చేస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. చివరి క్షణాల్లో ఓటర్లను తమవైపుకు తిప్పుకునేందుకు పార్టీలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. మరోవైపు మునుగోడులో డబ్బు, మద్యం ప్రలోభాలు భారీగా ఉన్నట్లు తెలుస్తోంది. సాయంత్రం 6గంటల తర్వాత అన్ని ప్రాంతాల్లో గట్టి నిఘా ఉంటుందని ఈసీ వెల్లడించింది. ప్రలోభాలు చేస్తూ పట్టుబడితే చర్యలు తప్పవని హెచ్చరిస్తోంది.