మునుగోడు ఉపఎన్నిక కౌంటింగ్ ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ప్రతి రౌండ్లోనూ టీఆర్ఎస్, బీజేపీ హోరాహోరీగా పోటీ పడుతున్నాయి. రెండు, మూడు రౌండ్లు మినహా అన్ని రౌండ్లలోనూ టీఆర్ఎస్ ముందంజలో ఉంది. స్వల్ప ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఓట్ల లెక్కింపు ప్రక్రియ వేగంగా జరుగుతోంది.
పదో రౌండ్ లో..
మునుగోడు బైపోల్ పదో రౌండ్ లో కూడా కారు పార్టీ స్వల్ప ఆధిక్యంలో నిలిచింది. టీఆర్ఎస్ కు 7,503 ఓట్లు పోలవ్వగా..బీజేపీకి 7,017 ఓట్లు వచ్చాయి. 10 రౌండ్లు ముగిసే సమయానికి మొత్తంగా టీఆర్ఎస్ కు 4,243 ఓట్ల ఆధిక్యం లభించింది. ఇక తదుపరిగా 11 రౌండ్ లో గట్టుప్పల్ మండలం12,13 రౌండల్లో మర్రిగూడ మండలం, 14,15 రౌండ్లలో నాంపల్లి మండల ఓట్లను లెక్కించనున్నారు.
తొమ్మిదో రౌండ్
మునుగోడు బై పోల్ తొమ్మిదో రౌండ్ ఫలితాల్లోనూ టీఆర్ఎస్ ముందంజలో నిలిచింది. ఇందులో టీఆర్ఎస్ కు 7,234 ఓట్లు, బీజేపీకి 6506 ఓట్లు వచ్చాయి.9 రౌండ్ల కౌంటింగ్ ముగిసే సమయానికి మొత్తంగా టీఆర్ఎస్ 3,632 ఓట్ల ఆధిక్యాన్ని సాధించింది.