మంత్రి కేటీఆర్ ఫోన్ చేసినా బీజేపీలోనే ఉంటానని తేల్చిచెప్పిన జగన్నాథంతో బీజేపీ ఎంపీ అర్వింద్ సెల్ఫీ దిగారు. ఆ ఫొటోను ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈ ఫొటోతో పాటు కీలక వ్యాఖ్యలను అర్వింద్ జోడించారు. ‘‘పార్టీ నన్ను, జగన్నాథం అన్నతో కలిసి బ్రహ్మాండంగా పనిచేయమని చెప్పింది. గట్టు్ప్పల్ ఇంఛార్జిగా నన్ను నియమించింది. జగన్నాథం అన్నగారితో కలిసి పని చేస్కుంటం. మునుగోడులో బీజేపీ జెండాను ఎగరేస్తం’’ అని తన ట్వీట్ లో అర్వింద్ పేర్కొన్నారు.
ఇటీవల మంత్రి కేటీఆర్ ఫోన్ చేసి ‘‘ మీరు కొంచెం సహకరిస్తే.. గట్టుప్పల్ ను అభివృద్ధి చేసుకుందాం’’ అని జగన్నాథంతో చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మంత్రి కేటీఆర్ ఫోన్ చేసినప్పటికీ.. ‘‘బీజేపీని మోసం చేసే ప్రసక్తే లేదు. మా పార్టీని వీడేది లేదు’’ అని జగన్నాథం నిర్మొహమాటంగా బదులిచ్చిన తీరుపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తాయి. ఈనేపథ్యంలో జగన్నాథంను మునుగోడు బై పోల్ బీజేపీ స్టీరింగ్ కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి కూడా స్వయంగా కలిసి అభినందించారు.