రేపు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి నామినేషన్

నల్గొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి రేపు నామినేషన్ వేయనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు చండూర్ లోని తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ సందర్భంగా బంగారుగడ్డ గ్రామం నుంచి చండూర్ ఎమ్మార్వో కార్యాలయం వరకు ఆమె ప్రదర్శన నిర్వహించనున్నారు. 

పాల్వాయి స్రవంతి నామినేషన్ కార్యక్రమానికి కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు భారీగా తరలిరావాలని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఉప ఎన్నిక ప్రక్రియలో నామినేషన్ దాఖలు చేయడానికి రేపే ఆఖరి రోజు. ఇప్పటికే బీజేపీ తరపున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, టీఆర్ఎస్ తరపున ఇవాళ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. శుక్రవారం చివరి రోజు కావడంతో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలకు దీటుగా నామినేషన్ వేసేందుకు కాంగ్రెస్ శ్రేణులు ప్రయత్నిస్తున్నాయి.