రేవంత్ పై మళ్లీ సీనియర్ల ఆగ్రహమెందుకు?

మునుగోడు ఉప ఎన్నిక కాంగ్రెస్ కు ప్రతిష్టాత్మకంగా మారింది. తమ సొంత సీటును ఎలాగైనా కాపాడుకోవాలని నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. షెడ్యూల్ రాకముందే వివిధ పేర్లతో కార్యక్రమాలు మొదలుపెట్టి జనంలోకి వెళ్తున్నారు. అయితే పార్టీ సీనియర్లు వెళ్తారని మొదట చెప్పారు. కానీ, సెగ్మెంట్ లో మాత్రం వాళ్లు ఎందుకు కనిపించడం లేదనే చర్చ ఇప్పుడు జోరుగా జరుగుతోంది.