మునుగోడులో TRS, BJP డబ్బుతో మాయచేశాయి: మల్లురవి

మునుగోడులో ఎన్నికలు  రాజ్యాంగబద్దంగా జరగలేదు

ప్రజలకు అన్యాయం జరిగితే పోరాటం చేసే ఏకైక పార్టీ కాంగ్రెస్ అని ఆ పార్టీ సీనియర్ నేత మల్లు రవి అన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ మూడో స్థానంలో నిలిచినంత మాత్రనా పార్టీ పనైపోయింది అనుకుంటే పోరపాటే అవుతుందని మల్లురవి చెప్పారు. 

మునుగోడులో ఎన్నికలు రాజ్యాంగ బద్దంగా ఎన్నికలు జరగలేదని, రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ  డబ్బు, మద్యం రాజకీయాలు చేశాయని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందని మల్లురవి ధీమా వ్యక్తం చేశారు.