యాదాద్రి భువనగిరి జిల్లా: మునుగోడు ఉప ఎన్నికలో పోటీ చేస్తున్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రతిరోజు సామాన్యులలో ఒకడిలా రకరకాల వేషధారణలలో కనిపిస్తూ వెరైటీగా ప్రచారం చేస్తున్నారు. ఒక రోజు డ్యాన్సులు చేస్తూ.. సైకిల్ తొక్కుతూ.. చేనులో పత్తి ఏరుతూ.. స్కూల్ పిల్లలకు గాలిలో ముద్దులు పెడుతూ.. బాయ్ బాయ్ చెప్పి ఓట్లు అడిగి అందరి దృష్టిని ఆకర్షించిన కేఏ పాల్ ఇవాళ గొర్రెల కాపరి వేషధారణలో కనిపించారు.
ప్రత్యేక శైలి మాటతీరుతో ప్రత్యేకతను చాటుకునే కేఏ పాల్ ఇవాళ గొర్రెల కాపరిలా ప్రచారం నిర్వహించారు. అన్ని వర్గాల ప్రజలు టీఆర్ఎస్ పాలనలో కష్టాలు పడుతున్నారని.. గొర్రెల కాపరులకు సైతం కష్టాలు తప్పడం లేదని కేఏ పాల్ ఆరోపించారు. డిగ్రీ, పీజీలు చదివినా ఉద్యోగాలు లేకపోవడంతో చాలా మంది గొర్రెలు కాయాల్సిన పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. ఉప ఎన్నికలో తనకు ఓటేస్తే.. గ్రామానికి ఇరవై మందికి చొప్పున ఉద్యోగం ఇస్తానంటూ నాంపల్లి మండలంలో ప్రచారం చేశారు.