ఓటమి భయంతోనే సెంటిమెంట్‌‌ డ్రామాలు : మంత్రి తలసాని

  • ఓటమి భయంతోనే సెంటిమెంట్‌‌ డ్రామాలు
  • మంత్రి తలసాని శ్రీనివాస్‌‌ యాదవ్‌‌

హైదరాబాద్‌‌, వెలుగు : మునుగోడు ఉపఎన్నికలో ఓటమి తప్పదని తెలుసుకుని బీజేపీ, కాంగ్రెస్‌‌ అభ్యర్థులు సెంటిమెంట్ డ్రామాలు మొదలుపెట్టారని మంత్రి తలసాని శ్రీనివాస్‌‌ యాదవ్‌‌ విమర్శించారు. మంగళవారం తెలంగాణ భవన్‌‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. జ్వరం, దాడులు అంటూ రెండు పార్టీల అభ్యర్థులు నాటకాలు ఆడుతున్నారని.. ప్రజలు వాటిని నమ్మి మోసపోవద్దని మంత్రి సూ చించారు. వచ్చే సాధారణ ఎన్నికల్లోపు మునుగోడులో అభివృద్ధి జరగకపోతే అప్పుడు ప్రజలు ఏ నిర్ణయం తీసుకున్నా స్వీకరించడానికి టీఆర్ఎస్ సిద్ధమని తెలిపారు.

జ్వరం పేరుతో రాజగోపాల్‌‌, ఏడుపులతో కాంగ్రెస్‌‌ అభ్యర్థి సానుభూతి పొందాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.  అయినా మునుగోడులో టీఆర్‌‌ఎస్‌‌ స్పష్టమైన మెజార్టీతో గెలుస్తుందని తలసాని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌‌, ఎమ్మెల్సీలు ఎం.ఎస్‌‌. ప్రభాకర్‌‌ రావు, ఎగ్గె మల్లేశం, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, కార్పొరేషన్ చైర్మన్ బాలరాజు తదితరులు పాల్గొన్నారు.