మునుగోడులో బీజేపీ ఇంటింటి ప్రచారం

నల్గొండ జిల్లా: మునుగోడు ఉప ఎన్నికలో రాజకీయ పార్టీల ప్రచారం ఊపందుకుంది. ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ పార్టీలు తమ  ప్రచార్నా స్పీడప్ చేస్తున్నాయి. కేంద్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో సుడిగాలి ప్రచారం చేయించిన బీజేపీ ఇంటింటి ప్రచారాన్ని చేపట్టింది.  నాంపల్లి మండలం దేవత్పల్లి గ్రామంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మద్దతుగా ఉపఎన్నికల స్టిరింగ్ కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి ఇంటింటి తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 

గడప గడపకూ వెళ్లి ప్రజలను పలుకరిస్తూ.. వారి క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకుంటూ ప్రచారాన్ని నిర్వహించారు. స్థానికులు తాము ఎదుర్కొంటున్న సమస్యలు తెలియజేయగా..గత ఎనిమిదేళ్ల పాలనలో వైఫల్యాలకు నిదర్శనమని.. ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలను నెరవేర్చకుండా మోసం చేశారని  క్లుప్తంగా వివరించారు. ఉప ఎన్నికలో రాజగోపాల్ రెడ్డిని గెలిపిస్తే.. మీకు అండగా నిలబడి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.