ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు చేయిస్తా : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు చేయిస్తా : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
  • ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

చండూరు, వెలుగు: నియోజకవర్గ వ్యాప్తంగా కంటి చూపుతో బాధ పడుతున్న ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు,  ఆపరేషన్​ అవసరం ఉన్న వారికి ఉచితంగా ఆపరేషన్​ చేయిస్తానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.  నాంపల్లి  జెడ్పీహెచ్ఎస్ లో  కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శంకర కంటి ఆసుపత్రి, ఫినిక్స్ ఫౌండేషన్ సౌజన్యంతో ఆదివారం ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.  నియోజకవర్గంలోని ప్రతీ మండలంలో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయిస్తానన్నారు. 

కంటి సమస్యలున్నవారు వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.  అనంతరం డాక్టర్లు పలువురికి కంటి వైద్య పరీక్షలు చేశారు.  స్థానిక నాయకులు భోజన సదుపాయం కల్పించారు.  కాంగ్రెస్ మండల శాఖ అధ్యక్షుడు కత్తి రవీందర్ రెడ్డి,  మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య, జెడ్పీటీసీ మాజీ సభ్యడు ఏవీ.రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వెన్నమనేని రవీందర్​రావు, సీనియర్​ నాయకుడు రఘుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బ్రహ్మోత్సవాలకు హాజరైన ఎమ్మెల్యే 

చండూరు పట్టణంలో జరుగుతున్న శ్రీమార్కండేశ్వర స్వామి,  వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆదివారం మునుగోడు ఎమ్మెల్యే  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరయ్యారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఆయనను ఆలయాల కమిటీలు, పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో సన్మానించారు.  చైర్మన్ రావిరాల నగేశ్, పద్మశాలీ సంఘం అధ్యక్షుడు గుర్రం భిక్షమయ్య, ట్రస్ట్ చైర్మన్ కోమటి వీరేశం, ట్రస్మా జిల్లా అధ్యక్షుడు కోడి శ్రీనివాసులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు దోటి వెంకటేశ్​యాదవ్, అనంత చంద్రశేఖర్ గౌడ్, భూతరాజు దశరథ పాల్గొన్నారు.