కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత నాదే : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 

  • మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 

చండూరు ( గట్టుప్పల్​) :  లోక్​సభ ఎన్నికల్లో కష్టపడి పని చేస్తున్న ప్రతి కార్యకర్తను కాపాడుకునే బాధ్యత తనదేనని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం గట్టుప్పల్​లో నిర్వహించిన బూత్ కమిటీ సభ్యుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రాణం పోయినా కోమటిరెడ్డి బ్రదర్స్ మాట తప్పరన్నారు. ఆరు రోజులు తన కోసం కష్టపడాలని, కార్యకర్తల కోసం తాను ఐదేండ్లు కష్టపడతానని, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తానన్నారు.

మండలంలోని పలు గ్రామాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పున్న కైలాస్ నేత, జిల్లా ఉపాధ్యక్షుడు దండు యాదగిరి రెడ్డి, మాజీ జడ్పీటీసీ నామని గోపాల్, మండల పార్టీ అధ్యక్షుడు నామని జగన్నాథం, మండల పార్టీ ఉపాధ్యక్షుడు రావుల రమేశ్, గోడ్డేటి శ్రీనివాస్, చెరిపెల్లి సత్తయ్య, నామని బుచ్చయ్య, చలమల వెంకటరమణారెడ్డి, వీరమల్ల శ్రీశైలం పాల్గొన్నారు.