మునుగోడు నియోజకవర్గంలో పర్యటించారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. మునుగోడు బస్టాండ్ ను సందర్శించిన రాజగోపాల్.. చౌటుప్పల్ వైపు వెళ్తున్న ఓ ఆర్టీసీ బస్సు ఎక్కి ప్రయాణికులను పలకరించారు.
ఉచిత బస్సు ప్రయాణం ఎలా ఉందని మహిళలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి రోజు ఎంత మంది మహిళలు ప్రయాణిస్తున్నారని డ్రైవర్ ను అడిగి తెలుసుకున్నారు రాజగోపాల్ రెడ్డి. అయితే ఉచిత ప్రయాణం చేసేవాళ్లము దర్జాగా కూర్చుంటున్నామని.. టికెట్ తీసుకున్న వాళ్లకు సీటు దొరకడం లేదని ఒక మహిళ చెప్పడంతో బస్సులో ఒక్కసారిగా అందరూ నవ్వారు.
ALSO READ | ప్రతి ఒక్కరూ యోగాను అలవాటు చేసుకోవాలి : కిషన్ రెడ్డి