రవాణా మంత్రిగా పొన్నం ప్రభాకర్ ఉండటం ఎంతో అదృష్టమన్నారు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. మంత్రి పొన్నం తనకు అత్యంత సన్నిహితుడని.. తెలంగాణ ఉద్యమంలో కలిసి పోరాడామని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ సహకారంతో మునుగోడు మండలం నుంచి ఆరు రూట్లకు బస్సు సౌకర్యం కల్పించారని తెలిపారు. 26 రూట్లకు బస్సు సర్వీసులను కోరగా ఆరు రూట్లకి ఏర్పాటు చేశారని చెప్పారు.
మునుగోడు నియోజకవర్గంలో బస్సు సర్వీస్ ఎక్కువ లేకపోవడంతో ప్రజలు ఎంతో ఇబ్బందులకు గురయ్యారని చెప్పారు రాజగోపాల్ రెడ్డి. బస్సు సర్వీసులను పెంచాలని మంత్రి పొన్నం ప్రభాకర్ను అడిగిన వెంటనే మంత్రి బస్సు ఏర్పాటు చేశారని చెప్పారు. ఆర్టీసీ అధికారులు బస్సులు సకాలంలో తిరిగేటట్లు చర్యలు తీసుకోవాలన్నారు.
ALSO READ | ఆ నలుగురు ప్రభుత్వ విప్లే నాకు కళ్లు, చెవులు: సీఎం రేవంత్ రెడ్డి
ఆర్టీసీ నష్టాలలో ఉన్నప్పటికీ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇస్తుందన్నారు. ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రతి ఒక్క మహిళ ఉపయోగించుకోవాలన్నారు. ప్రత్యేకంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కు మునుగోడు ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు రాజగోపాల్ రెడ్డి.