సర్పంచ్‌గా గెలిచి.. ఊరికి మంచి నీళ్లు కూడా ఇవ్వలేకపోతున్నానంటూ..

సర్పంచ్‌గా గెలిచి.. ఊరికి మంచి నీళ్లు కూడా ఇవ్వలేకపోతున్నానంటూ..

ప్రాజెక్టులు కాదు.. ముందు మంచినీరివ్వండి

నల్గొండ/మునుగోడు, వెలుగు: ప్రజలకు సరిపడా కృష్ణా జలాలు సరఫరా కావడం లేదని, సరఫరా చేయాలని డిమాండ్ ​చేస్తూ నల్గొండ జిల్లా మునుగోడు సర్పంచ్ ​మిర్యాల వెంకన్న మిషన్​ భగీరథ ట్యాంకుపైకి ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. ఆ సమయంలో సంబంధిత అధికారులకు ఫోన్​చేసి మాట్లాడారు. తాను సర్పంచ్‌గా గెలుపొంది ప్రజలకు సరిపడా నీరు అందించలేకపోతున్నందున సిగ్గుగా ఉందన్నారు. తక్షణమే గ్రామానికి సరిపడా నీరు సరఫరా చేయాలని, అప్పటివరకు తాను ట్యాంకు నుంచి కిందకు దిగబోనన్నారు. ప్రాజె క్టులు అవసరం లేదు.. ముందైతే తాగునీరు ఇవ్వండని అధికారులకు మొరపెట్టుకున్నారు. వెంటనే ఆర్‌డబ్ల్యూఎస్​ అధికారులు కిందిస్థాయి సిబ్బందిని పంపించి ఆయనకు నచ్చజెప్పారు. నీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటామని చెప్పి ఆయనను కిందకు దించారు.

రాష్ట్ర సర్పంచ్‌ల సంఘం మద్దతు

నల్గొండ జిల్లా మునుగోడు సర్పంచ్ వెంకన్న నిరసనకు  రాష్ట్ర సర్పంచ్‌ల సంఘం మద్దతు తెలిపింది. నీటి ఇక్కట్లకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు లక్ష్మీనరసింహారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మహిపాల్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రణీల్ చందర్ , మహిళా అధ్యక్షురాలు ధనలక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం పత్రిక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ పథకాలను అమలు చేస్తున్న సర్పంచ్‌ల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా కొందరు అధికారులు వ్యవహరిస్తున్నారని అన్నారు. సర్పంచ్‌లకు అధికారులు సహకరించటం లేదని ఆరోపించారు. వెంటనే మునుగోడులో నీటిని సరఫరా చేయాలన్నారు.  ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

For More News..

రూ. 170 కోసం గొడవ.. ఒకరి మృతి

కరోనా డెత్ రేటు మన దగ్గరే తక్కువ

50 ఏండ్ల తర్వాత కనిపించిన అరుదైన అడవి కుక్క