మునుగోడు కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ వార్.. చలమల కృష్ణారెడ్డి వర్సెస్ పున్న కైలాష్ నేత

నల్లగొండ జిల్లా మునుగోడు కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ వార్ ఇంకా చల్లారడం లేదు. నాయకుల మధ్య అధిపత్య పోరు ఇంకా కొనసాగుతోంది. చలమల కృష్ణారెడ్డి దిష్టిబొమ్మకు పున్న కైలాష్ నేత అనుచరులు శవయాత్ర నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమాన్ని చలమల కృష్ణారెడ్డి వర్గీయులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఉద్రికత్త ఏర్పడడంతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగి.. ఇరు వర్గాలను చెదరగొట్టారు. 

పున్న కైలాష్ పై చలమల కృష్ణారెడ్డి అసభ్య పదజాలంతో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారంటూ ఆయన అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డప్పుచప్పుళ్లతో చలమల కృష్ణారెడ్డి దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించడం ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కొన్నిరోజులుగా మునుగోడు నియోజకవర్గంలోని కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇటు హైదరాబాద్ లోని గాంధీభవన్ లోనూ చలమల కృష్ణారెడ్డి, కైలాష్ నేత వర్గీయుల గొడవ జరిగిన విషయం తెలిసిందే.