- హామీలు అమలు చేశాకే ఓట్లడగాలన్న ఉద్యమకారుడు
- ఫొటోలు తీస్తుండగా ‘వెలుగు’ రిపోర్టర్ ఫోన్ లాక్కున్న పోలీసులు
మునుగోడు, వెలుగు : ఉప ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి బుధవారం చల్మెడలో నిరసన సెగ తగిలింది. చల్మెడ గ్రామానికి వచ్చిన ప్రభాకర్‌రెడ్డి మాట్లాడదామని చూస్తుండగా గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు గాదపాక సైదులు అడ్డుకున్నారు. ‘గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చల్మెడ గ్రామం నుంచి గుజ్జా గ్రామానికి వెళ్లే మట్టి రోడ్డు రిపేర్లు చేయిస్తానని హామీ ఇచ్చారని, ఇప్పటివరకు చేయలేదని, హామీలు అమలు చేసిన తర్వాతనే ఊరిలో ఓట్లు అడగాలని నిలదీశారు.
ఇది గమనించిన స్థానిక నాయకులు అతనిపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి జోక్యం చేసుకొని సైదులును పక్కకు తీసుకెళ్లాలని పోలీసులకు ఆదేశించడంతో వారు ఆ ప్రయత్నం చేశారు.