చౌటుప్పల్: మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. నియోజకవర్గంలోని ప్రధాన రహదారులపై చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్గేట్ వద్ద పోలీసుల తనిఖీలు చేయగా.. ఓ కారులో రూ.20 లక్షల నగదు పట్టుబడింది.
విజయవాడ నుండి హైదరాబాదు వైపు వెళుతున్న అభిషేక్ అనే వ్యక్తి తన స్విఫ్ట్ కారులో 20 లక్షల రూపాయలు తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. అతని వద్ద ఎలాంటి రశీదులు, ఆధారాలు లేవని పట్టుపడిన నగదుతోపాటు కారును సీజ్ చేసి స్థానిక పోలీసులకు అప్పగించారు. పెద్ద మొత్తంలో నగదును ఎక్కడ్నుంచి తెస్తున్నాడు.. ఎక్కడికి తీసుకెళ్తున్నాడనే విషయంపై పోలీసులు మరింత లోతుగా విచారణ చేస్తున్నారు.