నల్గొండ జిల్లా గట్టుప్పల్ మండలం రంగం తండా గ్రామస్తులు ఉపఎన్నిక ఓటింగ్ ను బహిష్కరించారు. తమ గ్రామంలో మౌలిక వసతులు సరిగా లేవంటూ ఫైర్ అయ్యారు. సమస్యలను చాలాసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదన్నారు. తమకు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఓటు వేసేందుకు వెళ్లమని స్పష్టం చేశారు. ఈ తండాలో మొత్తం 320 ఓట్లు ఉన్నాయి.
స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా ఏ ప్రభుత్వం తమ గ్రామాన్ని పట్టించుకోలేదని..కనీసం రోడ్డు సౌకర్యం కల్పించలేదని తెలిపారు. అన్ని పార్టీల నాయకులు ఎన్నికల ముందు వచ్చి వాగ్దానాలు ఇచ్చి..తర్వాత విస్మరిస్తున్నారని ఆరోపించారు. తమ తండాను గ్రామపంచాయితీగా మార్చి నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలపై స్పష్టమైన హామీ ఇస్తేనే ఓటు వేస్తామంటూ నిరసన కొనసాగిస్తున్నారు.