తెలంగాణ పేరును తొలగించిన ఉద్యమకారుడు కేసీఆర్: అర్వింద్

కేసీఆర్ ను రోడ్డుమీదకు తీసుకొచ్చిన ఘనత రాజగోపాల్ రెడ్డిదేనని బీజేపీ ఎంపీ అర్వింద్ అన్నారు. సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ లో ఉన్న అభివృద్ధి మునుగోడులో సగమైన ఉందా అని ప్రశ్నించారు.    గజ్వేల్ కి కేటాయించిన నిధుల్లో సగమైనా మునుగోడుకు  కేటాయించాలంటూ రాజగోపాల్ రెడ్డి  అసెంబ్లీలో ఎన్నోసార్లు విన్నవించినా  పట్టించుకోలేదన్నారు. అందుకే రాజీనామా చేసి ఉప ఎన్నికకు వెళ్లిండన్నారు.  రాజగోపాల్ రెడ్డి మొనగాడని.. రాజీనామా చేసి  కేసీఆర్ మోకాన కొట్టిండన్నారు. 

కమ్యూనిస్టులు టీఆర్ఎస్ కు  ఎందుకు మద్దతు ఇస్తున్నారో అర్ధం కావడం లేదని అర్వింద్ అన్నారు.  దొరల పాలనకి, భూస్వాముల పాలనకు, రజాకార్ల పార్టీకి  ఏ రకంగా మద్దతు ఇస్తున్నారో కమ్యూనిస్టులు మునుగోడు ప్రజలకు చెప్పాలన్నారు.  ధర్నా చౌక్ ఎత్తివేసిన వాళ్ళకి మద్దతు  ఎందుకు ఇస్తున్నారో చెప్పాలి. టీఆర్ఎస్ ని గెలిపిస్తే మళ్లీ గడిలా పాలన వస్తుందన్నారు. 2023  వరకు కేసీఆర్ పాలన అంతం చేయాలన్నారు.  తెలంగాణ పేరును తొలగించిన ఉద్యమకారుడు కేసీఆరేనన్నారు.