బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌కు ఓటు అడిగే హక్కు లేదు : మురళీ నాయక్‌‌‌‌‌‌‌‌

గూడూరు, వెలుగు : పదేళ్ల పాలనలో తండాల్లో తట్టెడు మట్టి కూడా పోయని బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌కు ఓటు అడిగే హక్కు లేదని మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌ కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌‌‌‌‌ మురళీ నాయక్‌‌‌‌‌‌‌‌ అన్నారు. కేంద్ర మాజీమంత్రి బలరాంనాయక్, మానుకోట మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, సొసైటీ చైర్మన్‌‌‌‌‌‌‌‌ లింగారెడ్డితో కలిసి బుధవారం గూడూరు మండలంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేళ్ల కేసీఆర్‌‌‌‌‌‌‌‌ పాలనలో రాష్ట్రం 20 సంవత్సరాలు వెనుకబడిందన్నారు. మిగులు బడ్జెట్‌‌‌‌‌‌‌‌తో ఏర్పడిన తెలంగాణను కేసీఆర్‌‌‌‌‌‌‌‌ కుటుంబం దోచుకుందని విమర్శించారు.

రైతుల కోసం ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌లు కడుతున్నామని గొప్పలు చెప్పిన కేసీఆర్‌‌‌‌‌‌‌‌ అవినీతి పునాదుల మీద ఆ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ను నిర్మించారని ఆరోపించారు. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పారు. దోపిడీదారుల బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం కావాలో.. ప్రజల కోసం పని చేసే కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ కావాలో ప్రజలే ఆలోచించుకోవాలన్నారు. గ్రామాలు, తండాల్లో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ చేసిన అభివృద్ధే కనిపిస్తుంది తప్ప, బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌‌‌‌‌ శంకర్‌‌‌‌‌‌‌‌నాయక్‌‌‌‌‌‌‌‌ చేసిందేమీ లేదన్నారు. అనంతరం పలు పార్టీలకు చెందిన లీడర్లు కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌లో చేరారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు వెంకన్న, అమరేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, ప్రదీప్‌‌‌‌‌‌‌‌రెడ్డి, సంపత్, శివ, బుడిగె సతీశ్‌‌‌‌‌‌‌‌, మధు, చంటి, శ్రీపాల్‌‌‌‌‌‌‌‌రెడ్డి పాల్గొన్నారు.