కల్వకుంట్ల ఫ్యామిలీని తరిమికొట్టాలి

  •     కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌తోనే అభివృద్ధి సాధ్యం
  •     మహబుబాబాద్‌‌‌‌‌‌‌‌ కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌‌‌‌‌ మురళీనాయక్‌‌‌‌‌‌‌‌ 

గూడూరు, వెలుగు : కమీషన్ల కల్వకుంట్ల ఫ్యామిలీని వచ్చే ఎన్నికల్లో తరిమికొట్టాలని మహబుబాబాద్‌‌‌‌‌‌‌‌ కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌‌‌‌‌ మురళీనాయక్‌‌‌‌‌‌‌‌ పిలుపునిచ్చారు. మహబుబాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లా గూడూరు మండలంలోని పలు గ్రామాల్లో శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కల్వకుంట్ల ఫ్యామిలీకి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగాలు వస్తాయని ఆశపడ్డ వారికి నిరాశే మిగిలిందన్నారు.

మిగులు బడ్జెట్‌‌‌‌‌‌‌‌తో ఉన్న తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారని విమర్శించారు. కమీషన్లకు కక్కుర్తి పడి కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ డిజైన్‌‌‌‌‌‌‌‌ మార్చిన కేసీఆర్‌‌‌‌‌‌‌‌ రూ. లక్ష కోట్లు దోచుకున్నాడని ఆరోపించారు. ప్రత్యేక రాష్ట్రంతోనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందన్న ఉద్దేశంతో రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియాగాంధీ రుణం తీర్చుకోవాలని చెప్పారు.  కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేస్తుందన్నారు. అబద్ధపు హామీలతో పదేళ్లుగా రాష్ట్రాన్ని పాలిస్తున్నారని, మరో 20 రోజుల్లో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ గద్దె దిగడం ఖాయమన్నారు.

అబద్ధపు హామీలకు ప్రజలు మోసపోవద్దని చెప్పారు. అనంతరం పలువురు కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌లో చేరగా, వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో వెంకన్న, రమణారెడ్డి, కొమ్మాల్, సురేశ్‌‌‌‌‌‌‌‌, నరేశ్‌‌‌‌‌‌‌‌రెడ్డి, సంపత్, ప్రదీప్‌‌‌‌‌‌‌‌రెడ్డి, శ్రీపాల్‌‌‌‌‌‌‌‌రెడ్డి పాల్గొన్నారు.