టీమిండియా క్రికెటర్ మురళీ విజయ్ రిటైర్మెంట్ ప్రకటించాడు. అన్ని రకాల అంతర్జాతీయ క్రికెట్ ఫార్మట్ల నుంచి తప్పుకుంటున్నట్లుగా విజయ్ వెల్లడించాడు. 2008 నుంచి 2015 వరకు 7 ఏళ్ల పాటు సాగిన తన కెరీర్‌లో సహకరించిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపాడు. భారత్ తరుపున మొత్తం 61 టెస్టు మ్యాచ్ లు ఆడిన మురళీ విజయ్ 3,982 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలు, 15 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో 17 మ్యాచ్ లు ఆడిన విజయ్.. 339 పరుగులు చేశాడు. ఇక టీ20ల్లో 9 మ్యాచ్ లు ఆడి 169 రన్స్ చేశాడు. ఐపీఎల్ లో 106 మ్యాచ్ లు ఆడి 2,619 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు 13 హాఫ్ సెంచరీలున్నాయి. విజయ్ చివరిసారిగా 2018లో పెర్త్‌లో జరిగిన ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ తరఫున ఆడాడు.