Xiaomi ఇండియా ప్రెసిడెంట్ పదవికి మురళీ కృష్ణన్ రాజీనామా చేశారు. Xiaomi ఇండియా అధ్యక్షునిగా ఆరేళ్లుగా పనిచేస్తున్న మురళి .. ఎగ్జిక్యూటివ్ పదవికి రాజీనామా చేసి స్వతంత్ర సలహాదారుగా కొనసాగనున్నారు.
2028లో Xiaomi ఇండియాలో చేరారు మురళి కృష్ణన్. 2022లో ప్రెసిడెంట్ కావడానికి ముందు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ తో సహా సంస్థలో పలు కీలక పదవుల్లో పనిచేశారు.
మురళి వారుసుడిని Xiaomi ఇండియా ఇంకా ప్రకటించలేదు. సుధీన్ మాథుర్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, సమీర్ రావ్ (CFO), వరుణ్ మదన్ (CPO), అనుజ్ శర్మ (CMO) లతో భారత్ లో కంపెనీ వృద్ధి కోసం పనిచేయనున్నట్లు తెలుస్తోంది.
Also Read:-అమెరికా అధ్యక్ష ఎన్నికలు..ఇండియన్ ఐటీపై ప్రభావం చూపే ఐదు అంశాలు