మహబూబాబాద్ అర్బన్, వెలుగు : మహబూబాబాద్ నియోజకవర్గంలో తాను 50 వేల మెజార్టీతో గెలుస్తానని కాంగ్రెస్ క్యాండిడేట్ మురళీనాయక్ ధీమా వ్యక్తం చేశారు. మహబూబాబాద్ మున్సిపాలిటీలోని పలు వార్డులలో సోమవారం ప్రచారం నిర్వహించి మాట్లాడారు. కల్వకుంట్ల కవిత ఢిల్లీలో లిక్కర్ దందా చేసి తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిందన్నారు.
రాష్ట్రంలో కేసీఆర్ వాడవాడలకు వైన్ షాపులు తెరిచి అందరినీ తాగుడుకు అలవాటు చేయిస్తున్నారని మండిపడ్డారు. లిక్కర్‌పై వచ్చే ఆదాయంతోనే ప్రభుత్వాన్ని నడపడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ హయాంలో ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు వస్తే... ప్రస్తుతం నెలాఖరు వరకు కూడా రావడం లేదన్నారు.