నెల్లికుదురు, వెలుగు : కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని మహబూబాబాద్ కాంగ్రెస్ క్యాండిడేట్ మురళీనాయక్ చెప్పారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని వావిలాల, ఆలేరు, నరసింహులగూడెం, బంజర, మునిగిలవీడు గ్రామాల్లో సోమవారం ప్రచారం నిర్వహించి మాట్లాడారు. గత ఎన్నికల టైంలో రూ. లక్ష రుణమాఫీ చేస్తానని చెప్పిన కేసీఆర్ పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోయారన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పారు. మహిళలకు ప్రతినెల రూ. 2500 పింఛన్, రూ. 500లకే సిలిండర్, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామన్నారు. పోడు రైతులకు 2005 అటవీ చట్టం ప్రకారం పట్టాలు ఇస్తామని ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో చేతి గుర్తుపై ఓటు వేసి తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ రుణం తీర్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గొల్లపల్లి ప్రభాకర్‌గౌడ్, సత్యపాల్‌రెడ్డి, యాదవ్‌రెడ్డి, బాలాజీ, నాగరాజు పాల్గొన్నారు.