క్వాలిటీ లేని ప్రాజెక్టులతో ప్రజలపై భారం : మురళీనాయక్‌‌‌‌

మహబూబాబాద్‌‌‌‌ అర్బన్‌‌‌‌, వెలుగు : కమీషన్లకు ఆశపడి క్వాలిటీ లేని ప్రాజెక్టులు కట్టి ప్రజలపై లక్షల కోట్ల రుణభారం వేశారని కాంగ్రెస్‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌ మురళీనాయక్‌‌‌‌ విమర్శించారు. మహబూబాబాద్‌‌‌‌ మండలం వేంనూరు, కృష్టాపురం, ఇందిరానగర్‌‌‌‌ శివారు తండాల్లో గురువారం ఆయన ప్రచారం నిర్వహించి మాట్లాడారు. ప్రతి గ్రామానికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి, ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందించిన ఘనత కాంగ్రెస్‌‌‌‌దేనన్నారు.

బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ హయాంలో కమీషన్లు ఇచ్చిన వారికే డబుల్‌‌‌‌ బెడ్‌‌‌‌రూం ఇండ్లు, పైసలు ఇచ్చిన వారికే పథకాలు ఇచ్చారని ఆరోపించారు. అలాగే సీపీఐ జాతీయకార్యవర్గ సభ్యుడు చాడా వెంకట్‌‌‌‌రెడ్డి మాట్లాడుతూ బీజేపీకి ఓటేస్తే బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌కు వేసినట్లేనన్నారు. కేసీఆర్‌‌‌‌కు ఫామ్‌‌‌‌హౌజ్‌‌‌‌లో విశ్రాంతి తీసుకోవడం తప్పదన్నారు. కార్యక్రమంలో విజయ సారథి, భూక్యా ఉమా మురళీనాయక్, అజయ్‌‌‌‌ సారథిరెడ్డి, లీడర్లు వెంకట్‌‌‌‌రెడ్డి, పోతు రాజు, పెరుగు కుమార్ పాల్గొన్నారు. అలాగే మురళీనాయక్‌‌‌‌కు ముస్లిం హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్‌‌‌‌ ప్రెసిడెంట్ ఎంఏ. అజీమ్‌‌‌‌ మద్దతు ప్రకటించారు