అత్తగారింట్లో నిద్రిస్తున్న అల్లుడి హత్య

అత్తగారింట్లో నిద్రిస్తున్న అల్లుడి హత్య
  •     బిడ్డను వేధిస్తున్నాడని  రాళ్లతో కొట్టి చంపిన మామ
  •     గద్వాల జిల్లా ఉండెవెల్లిలో ఘటన  

అలంపూర్, వెలుగు : జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లిలో బిడ్డను వేధిస్తున్నాడని ఓ మాత తన అల్లుడిని హత్య చేశాడు. పోలీసుల కథనం ప్రకారం..ఉండవెల్లికి చెందిన చాకలి మద్దిలేటికి ఇద్దరు కూతుళ్లు. చిన్న కూతురు మహేశ్వరిని ఆరేండ్ల కింద ఏపీలోని కర్నూల్​కు చెందిన దేవేందర్(36)కు ఇచ్చి పెండ్లి చేశారు. మద్యానికి బానిసైన దేవేందర్ అప్పటినుంచే మహేశ్వరిని వేధిస్తున్నాడు. దీంతో మహేశ్వరి కొద్ది రోజులుగా పుట్టింట్లోనే ఉంటోంది. శనివారం రాత్రి దేవేందర్ ఉండవెల్లిలోని మామ ఇంటికి వచ్చి మరోసారి మహేశ్వరితో గొడవపడ్డాడు. 

కొద్దిసేపటికి నిద్రపోగా బిడ్డతో గొడవపడ్డ విషయం మామ మద్దిలేటికి తెలిసింది. దీంతో పడుకున్న అల్లుడిని పొయ్యికి పెట్టుకునే రాళ్లతో కొట్టి చంపాడు. నిందితుడు పరారీలో ఉన్నాడని సీఐ రవిబాబు తెలిపారు. మృతుడి తల్లి జయమ్మ  ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఘటనా స్థలాన్ని గద్వాల డీఎస్పీ సత్యనారాయణ, సీఐ, ఎస్ఐ శ్రీనివాసుతో కలిసి పరిశీలించారు.