మాకు ఆహారం వద్దు.. డ్రగ్స్, గంజాయి ఇవ్వండి: జైలులో మీరట్ మర్డర్ కేసు నిందితుల డిమాండ్

మాకు ఆహారం వద్దు.. డ్రగ్స్, గంజాయి ఇవ్వండి: జైలులో మీరట్ మర్డర్ కేసు నిందితుల డిమాండ్

మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్‌‌‌‌పుత్‎ను ప్రియుడితో కలిసి అతడి భార్య ముస్కాన్ రస్తోగి దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. నిందితులు ముస్కాన్, ఆమె ప్రియుడు సాహిల్‎ను పోలీసులు అరెస్ట్ చేసి మీరట్‎లోని చౌదరి చరణ్ సింగ్ జిల్లా జైలుకు జ్యుడిషియల్ రిమాండ్‎కు తరలించారు. ఈ క్రమంలోనే వీరి గురించి షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ముస్కాన్, సాహిల్ డ్రగ్స్‎కు బానిసలయ్యారని పోలీసులు గుర్తించారు. జైలులో కూడా తమకు ఆహారం వద్దని.. డ్రగ్స్, గంజాయి ఇవ్వాలని నిందితులు డిమాండ్ చేస్తోన్నట్లు పోలీసులు తెలిపారు. జ్యుడిషియల్ కస్టడీకి వచ్చినాటి నుంచి డ్రగ్స్ లేకపోవడంతో జైల్లో వీరు వింత ప్రవర్తిస్తున్నారని చెప్పారు. 

జైల్లో తమ ఇద్దరిని ఒకే చోట ఉంచాలని నిందితులు కోరగా.. జైలు నిబంధనలు ప్రకారం అధికారులు ఇద్దరిని వేర్వేరు బ్యారక్‏లో ఉంచారు. ముస్కాన్ ను మహిళల బ్యారక్ లో ఉంచగా, సాహిల్ ను పురుషుల విభాగంలో ఉంచారు. జైల్లో ముస్కాన్ బాధతో ఉన్నట్లు కనిపించిందని.. ఆహారం తినడానికి నిరాకరించిందని.. రాత్రంతా నిద్రపోకుండా అలాగే మేల్కొని ఉందని తెలిపారు. ఇక ముస్కాన్ ప్రియుడు సాహిల్ మాత్రం సైలెంట్‎గా ఉన్నాడని.. కానీ తనకు డ్రగ్స్ కావాలని జైలు సిబ్బందిని అడిగాడని పోలీసులు  వెల్లడించారు. సాహిల్ విపరీతంగా డ్రగ్స్ కు అడిక్ట్ అయ్యాడని.. డ్రగ్స్ లేకపోవడంతో నరకయాతన అనుభవిస్తున్నాడని పేర్కొన్నారు. 

నిందితులు ఇద్దరినీ జైలులోని డీ-అడిక్షన్ సెంటర్‌లో పరిశీలనలో ఉంచామని.. వారి పరిస్థితి మరింత దిగజారితే  ఆసుపత్రికి తరలిస్తామని తెలిపారు.  నిందితులు కోలుకోవడానికి 8 నుంచి 10 రోజులు పట్టవచ్చని చెప్పారు. ప్రస్తుతం వైద్యులు వారి ఆరోగ్యాన్ని నిశితంగా పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు. ఖైదీలకు అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని సీనియర్ జైలు సూపరింటెండెంట్ డాక్టర్ వీరేష్ రాజ్ శర్మ తెలిపారు. జైలు యంత్రాంగం నిందితులకు డీ-అడిక్షన్ సెంటర్ ద్వారా కౌన్సెలింగ్ నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోందని.. మాదకద్రవ్య వ్యసనాన్ని అధిగమించడానికి వారికి మందులు కూడా ఇస్తున్నట్లు తెలిపారు.

ALSO READ : ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో నగదు కేసు.. వీడియోలు విడుదల చేసిన సుప్రీంకోర్టు

కాగా, అమెరికాలోని ఓ కంపెనీలో పనిచేస్తున్న మర్చంట్ నేవీ ఆఫీసర్​సౌరభ్ రాజ్‎పుత్‎ను అతని భార్య ముస్కాన్ రస్తోగి ప్రియుడితో కలిసి హత్య చేసింది. ఆ తర్వాత భర్త డెడ్​బాడీని15 ముక్కలుగా నరికి.. ప్లాస్టిక్ డ్రమ్ములో వేసి సిమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌తో సీల్ చేశారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌‌‌‌ మీరట్‌‌‌‌లో జరిగింది. సౌరభ్ రాజ్‎పుత్ ముస్కాన్ రస్తోగిని లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. 2019లోనే వారికి ఒక కుమార్తె కూడా పుట్టింది. కుటుంబ సభ్యులతో గొడవల కారణంగా భార్యతో కలిసి వేరుగా ఉంటున్నాడు సౌరభ్. వేరు కాపురం పెట్టాక ముస్కాన్ ప్రవర్తనలో మార్పు వచ్చింది. 

ముస్కాన్ తన లవర్ సాహిల్‌‌‌‌తో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు సౌరభ్‌‌‌‌కు తెలిసింది. దాంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. తన కూతురు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సౌరభ్ విడాకుల నిర్ణయాన్ని కూడా వెనక్కి తీసుకున్నాడు. ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లిన సౌరభ్ ఫిబ్రవరి 28న తన కూతురు బర్త్ డే ఉండటంతో ఫిబ్రవరి 24న ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలోనే  మార్చి 4న సౌరభ్ తినే ఆహారంలో ముస్కాన్ నిద్రమాత్రలు కలిపింది. ఆపై సాహిల్, ముస్కాన్‌‌‌‌ కలిసి సౌరభ్‌‌‌‌ను కత్తితో పొడిచి చంపారు. డెడ్ బాడీని 15 ముక్కలుగా కోసి, డ్రమ్ములో వేసి, సిమెంటుతో సీల్ చేశారు.