జంటనగరాల్లో వరుస మర్డర్లు కలకలం సృష్టిస్తున్నాయి. హైదరాబాద్ షా అలీ బండా పోలీస్ స్టేషన్ పరిధిలో గంట వ్యవధిలోనే హత్య.. మరో రెండు హత్యాయత్నాలు జరిగాయి. కాలాపతేర్ పాతబస్తీలో రఫీక్ బిన్ షిమ్లాన్ ను.. స్నేహితుడు ఖలీద్ కత్తితో దాడి చేయడంతో మృతి చెందాడు. చందూలాలా బారాదరి దగ్గర గుర్తు తెలియని వ్యక్తిపై 30 ఏళ్ల ఫక్రుద్దీన్ హత్యాయత్నానికి పాల్పడ్డాడు.
ఘటనా స్థలానికి చేరుకున్న షా అలీ బండా, కాలాపతేర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గాయపడ్డ వ్యక్తిని చికిత్స కోసం హాస్పిటల్ కు తరలించారు. డెడ్ బాడీని ఉస్మానియా మార్చురీకి తరలించారు పోలీసులు. సికింద్రాబాద్ తుకారాం గేట్ పీఎస్ పరిధిలో భార్యను హత్య చేసి పరార్ అయ్యాడు భర్త లక్ష్మణ్. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తున్నారు. మృతదేహాన్ని గాంధీ మార్చురికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.