ముర్షిదాబాద్‌ అల్లర్లపై స్పందించినNHRC..మూడు వారాల్లో నివేదిక

ముర్షిదాబాద్‌ అల్లర్లపై స్పందించినNHRC..మూడు వారాల్లో నివేదిక

పశ్చిమ బెంగాల్ లోని ముర్షిదాబాద్ లో వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో హింసపై జాతీయ మానవహక్కుల కమిషన్ స్పందించింది. మూడు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. విచారణకు దర్యాప్తు విభాగం నుంచి ఓ బృందాన్ని పంపాలని నిర్ణయించింది. అల్లర్లపై ఫిర్యాదులు రావడంతో విచారణ చేపట్టినట్లు NHRC తెలిపింది. 

శుక్రవారం మధ్యాహ్నం నుంచి సుతి, ధులియన్, సంసేర్‌గంజ్ మరియు జంగీపూర్ ప్రాంతాల్లో చెలరేగిన హింసలో ముగ్గురు ముర్షిదాబాద్ తో సహా సుతి, ధులియన్, సంసేర్ గంజ్, జంగీపూర్ ప్రాంతాల్లో శుక్రవారం చెలరేగిన హింసలో ముగ్గురు మరణించగా, అనేక మంది గాయపడ్డారు. వక్ఫ్ (సవరణ) చట్ట వ్యతిరేక నిరసనల్లో ముస్లింలు అధికంగా నివసించే జిల్లాలో జరిగిన హింసకు సంబంధించి ఇప్పటివరకు మొత్తం 221 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. 

Also Read :- ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ కమిషన్ చైర్మన్గా మీరాబాయి చాను

మరోవైపు ముర్షిదాబాద్ హింసపై ప్రాథమిక దర్యాప్తు గురించి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (MHA)కి స్పందించింది. ఇది బంగ్లాదేశ్ దుండగుల ప్రమేయం ఉండొచ్చని అనుమానించింది.  కేంద్ర హోం కార్యదర్శి పశ్చిమ బెంగాల్ ప్రధాన కార్యదర్శి ,డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌తో అల్లర్లపై సమీక్ష నిర్వహించారు. 

ముర్షిదాబాద్‌లో శాంతిభద్రతలను కాపాడేందుకు తొమ్మిది కంపెనీలకు చెందిన సరిహద్దు భద్రతా దళాలు 900 మంది మోహరించారు. రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థన మేరకు 300 మంది BSF సిబ్బందితోపాటు  ఇతర అదనపు కంపెనీలతో భద్రత కట్టుదిట్టం చేశారు.