![దుబాయ్ మ్యూజియం ఆఫ్ ఫ్యూచర్‌లో హ్యూమనాయిడ్ రోబో](https://static.v6velugu.com/uploads/2022/10/Museum-Of-Future-In-Dubai-Welcomes-A-Humanoid-Robot-Staff,-Ameca_vsUzWgHerT.jpg)
దుబాయ్‌లోని మ్యూజియం ఆఫ్ ఫ్యూచర్, అత్యంత అధునాతన హ్యూమనాయిడ్ రోబోట్ కు స్వాగతం పలికింది. ఈ రోబో సిబ్బందితో మాట్లాడుతూ అందర్నీ ఆకర్షిస్తోంది. అమెకా అని పేరు పెట్టబడిన ఈ హ్యూమనాయిడ్ రోబోట్.. పలకరించగలదు, దిశలను అందించగలదు, అనేక భాషల్లో మాట్లాడగలదు కూడా. ఈ ఆండ్రాయిడ్ ప్రస్తుతం నడవలేనప్పటికీ, దీనికి సంబంధించి సాంకేతిక పరిజ్ఞాన ఆవిష్కర్తలు మానవులకు మరింత సారూప్యంగా ఉండేలా ఓ వెర్షన్‌పై పని చేస్తున్నామని ARN న్యూస్ నివేదించింది.
నాలుగు రోజుల క్రితం ఈ అమెకా అనే హ్యూమనాయిడ్ రోబోట్ కి సంబంధించిన ఓ వీడియోను మ్యూజియం ఆఫ్ ఫ్యూచర్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ పేజీలలో పోస్ట్ చేసింది. ఈ వీడియో రోబోట్, సిబ్బందితో మాట్లాడడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ వీడియోతో పాటు అమెకా, ప్రపంచంలోనే అత్యంత అధునాతన హ్యూమనాయిడ్ రోబోట్ మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్ బృందంలో చేరిందని మ్యూజియం ఆఫ్ ఫ్యూచర్ రాసుకొచ్చింది.