దులీప్ ట్రోఫీలో ముషీర్ ఖాన్ భారీ సెంచరీతో కదం తొక్కాడు. సర్ఫరాజ్ తమ్ముడిగా క్రికెట్ లో అందరికీ పరిచయమైన ఈ యువ క్రికెటర్ దేశవాళీ క్రికెట్ లో అద్భుతంగా ఆడుతున్నాడు. స్టార్ బ్యాటర్లందరూ విఫలమైన చోట తన జట్టును ఒంటరి పోరాటంతో ఆదుకున్నాడు. 373 బంతుల్లో 181 పరుగులు చేసి తృటిలో డబుల్ సెంచరీ చేజార్చుకున్నాడు. అతని ఇన్నింగ్స్ లో 16 ఫోర్లు 5 సిక్సులున్నాయి. ఇండియా–బి టీమ్ తరపున ఆడుతున్న ముషీర్ జట్టుకు గౌరప్రదమైన స్కోర్ ను అందించాడు.
ALSO READ | AFG vs NZ: న్యూజిలాండ్ జట్టులో చేరిన భారత మాజీ బ్యాటింగ్ కోచ్
జట్టు చేసిన 321 పరుగుల్లో ఒక్కడే 181 పరుగులు చేయడం విశేషం. ఆకాష్ దీప్,ఆవేశ ఖాన్, ఖలీల్ అహ్మద్, కుల్దీప్ యాదవ్ లాంటి టాప్ క్లాస్ బౌలింగ్ తట్టుకొని ముషీర్ నిలబడ్డాడు. ఓవర్ నైట్ 105 పరుగుల వద్ద బ్యాటింగ్ కొనసాగించిన ఈ ముంబై ప్లేయర్.. రెండో రోజు కూడా అదే జోరును కొనసాగించాడు. మరో కీలకమైన 76 పరుగులు జట్టుకు అందించాడు. ముషీర్ తో పాటు సైనీ (56) హాఫ్ సెంచరీ చేయడంతో ఇండియా–బి తొలి ఇన్నింగ్స్ లో 321 పరుగులకు ఆలౌటైంది.
ఇండియా–డి 164 ఆలౌట్
అనంతపూర్‌లో జరుగుతున్న మరో మ్యాచ్‌లో ఇండియా–డి బ్యాటింగ్‌లో ఫెయిలైంది. అక్షర్ పటేల్ (86) ఒంటరి పోరాటం చేసినా తొలి ఇన్నింగ్స్‌లో 48.3 ఓవర్లలో 164 రన్స్‌కే కుప్పకూలింది. విజయ్‌కుమార్ (3/19), అన్షుల్ కాంబోజ్ (2/47), హిమాన్షు చౌహాన్ (2/22) దెబ్బకు ఇన్నింగ్స్‌లో ఆరుగురు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. అంతరం బ్యాటింగ్ చేసిన ఇండియా–సి 168 పరుగులకే ఆలౌట్ కావడం విశేషం. హర్షిత్ రానా 4 వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బ తీశాడు.
STAND UP & SALUTE, THE CHAMPION, MUSHEER KHAN 👌
— Johns. (@CricCrazyJohns) September 6, 2024
94/7 to 299/8 with Musheer Khan scoring 181 runs, He missed a well deserving Double Hundred. pic.twitter.com/zXdW4jTX8t