ముషీర్‌‌‌‌‌‌‌‌ సెంచరీ..ఇండియా-బి తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో 202/7

బెంగళూరు : దులీప్‌‌‌‌‌‌‌‌ ట్రోఫీలో ఇండియా–బి టీమ్‌‌‌‌‌‌‌‌ తడబడి తేరుకుంది. ఇండియా–ఎ టీమ్‌‌‌‌‌‌‌‌ బౌలర్ల దెబ్బకు ఓ దశలో 97 రన్స్‌‌‌‌‌‌‌‌కే 7 వికెట్లు కోల్పోయినా ముషీర్‌‌‌‌‌‌‌‌ ఖాన్‌‌‌‌‌‌‌‌ (105 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌) సెంచరీతో ఆదుకున్నాడు. దీంతో  గురువారం తొలి రోజు ఆట ముగిసే టైమ్‌‌‌‌‌‌‌‌కు ఇండియా–బి తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో 79 ఓవర్లలో 202/7 స్కోరు చేసింది. ముషీర్‌‌‌‌‌‌‌‌తో పాటు నవ్‌‌‌‌‌‌‌‌దీప్‌‌‌‌‌‌‌‌ సైనీ (29 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌) క్రీజులో ఉన్నారు. టాస్‌‌‌‌‌‌‌‌ ఓడి బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌కు దిగిన ఇండియా–బి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో యశస్వి జైస్వాల్‌‌‌‌‌‌‌‌ (30)

 అభిమన్యు ఈశ్వరన్‌‌‌‌‌‌‌‌ (13) తొలి వికెట్‌‌‌‌‌‌‌‌కు 33 రన్స్‌‌‌‌‌‌‌‌ జోడించి శుభారంభాన్నిచ్చారు. కానీ సర్ఫరాజ్‌‌‌‌‌‌‌‌ ఖాన్‌‌‌‌‌‌‌‌ (7), రిషబ్‌‌‌‌‌‌‌‌ పంత్‌‌‌‌‌‌‌‌ (7), నితీష్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ రెడ్డి (0), సుందర్‌‌‌‌‌‌‌‌ (0), సాయి కిశోర్‌‌‌‌‌‌‌‌ (1) ఫెయిలయ్యారు. చివర్లో ముషీర్‌‌‌‌‌‌‌‌, సైనీ ఎనిమిదో వికెట్‌‌‌‌‌‌‌‌కు 108 రన్స్‌‌‌‌‌‌‌‌ జోడించి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ను నిలబెట్టారు. ఖలీల్‌‌‌‌‌‌‌‌, ఆకాశ్‌‌‌‌‌‌‌‌దీప్‌‌‌‌‌‌‌‌, అవేశ్‌‌‌‌‌‌‌‌ తలా రెండు వికెట్లు తీశారు. 

ఇండియా–డి 164 ఆలౌట్‌‌‌‌‌‌‌‌

అనంతపూర్‌‌‌‌‌‌‌‌లో జరుగుతున్న మరో మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో ఇండియా–డి బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌లో ఫెయిలైంది. అక్షర్‌‌‌‌‌‌‌‌ పటేల్‌‌‌‌‌‌‌‌ (86) ఒంటరి పోరాటం చేసినా తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో 48.3 ఓవర్లలో 164 రన్స్‌‌‌‌‌‌‌‌కే కుప్పకూలింది. విజయ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ (3/19), అన్షుల్‌‌‌‌‌‌‌‌ కాంబోజ్‌‌‌‌‌‌‌‌ (2/47), హిమాన్షు చౌహాన్‌‌‌‌‌‌‌‌ (2/22) దెబ్బకు ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో 

ఆరుగురు సింగిల్‌‌‌‌‌‌‌‌ డిజిట్‌‌‌‌‌‌‌‌కే పరిమితమయ్యారు. తర్వాత బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌కు దిగిన ఇండియా–సి ఆట ముగిసే టైమ్‌‌‌‌‌‌‌‌కు తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో 33 ఓవర్లలో 91/4 స్కోరు చేసింది. బాబా ఇంద్రజిత్‌‌‌‌‌‌‌‌ (15 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌), అభిషేక్‌‌‌‌‌‌‌‌ పోరెల్‌‌‌‌‌‌‌‌ (32 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌) క్రీజులో ఉన్నారు. హర్షిత్‌‌‌‌‌‌‌‌, అక్షర్‌‌‌‌‌‌‌‌ చెరో రెండు వికెట్లు తీశారు.