
- ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్
ముషీరాబాద్, వెలుగు : ప్రతి ఒక్కరూ సేవా భావాన్ని అలవర్చుకోవాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ సూచించారు. ముషీరాబాద్‌కు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నేత టి. సోమన్ బర్త్ డే వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే ముఠా గోపాల్, ముఠా జయసింహ, ఎన్నారై సునీల్, ముచ్చకుర్తి ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కరోనా సమయంలో, మూడేండ్ల కిందట సిటీలో వరదలు వచ్చినప్పుడు పేదలకు, బాధిత కుటుంబాలకు సోమన్ అండగా నిలిచారన్నారు.
ప్రతి కార్యకర్త సేవా భావాన్ని అలవర్చుకొని పార్టీని మరింత బలోపేతం చేసే విధంగా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ ముషీరాబాద్ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు నర్సింగ్ ప్రసాద్, ఆకుల అరుణ్ కుమార్, శ్రీధర్ రెడ్డి, శ్రీనివాస్, శివ ముదిరాజ్, దీన్ దయాళ్ రెడ్డి, శ్రీధర్ చారి, బల్ల ప్రశాంత్, రాజు తదితరులు పాల్గొన్నారు.