టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గ్రౌండ్ లో చాలా దూకుడుగా ఉంటాడు. మ్యాచు ప్రారంభం నుంచి చివరి వరకు అంతే ఎనర్జీ విరాట్ సొంతం. ప్రత్యర్థి ఆటగాళ్లు కవ్విస్తే అంతకంతకు తన బ్యాట్ తోనే సమాధానం చెబుతాడు. అయితే విరాట్ కోహ్లీ కూడా స్లెడ్జింగ్ చేస్తాడని బంగ్లాదేశ్ క్రికెటర్ ముష్ఫికర్ రహీమ్ షాకింగ్ కామెంట్స్ చేసాడు.
క్రికెట్ లో స్లెడ్జింగ్ అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. వికెట్ రాని పక్షంలో ప్రత్యర్థి బ్యాటర్ ఏకాగ్రతను చెడగొట్టాలని వారిని మాటలతో రెచ్చగొట్టడమే ఈ స్లెడ్జింగ్. ఈ క్రమంలో కొన్ని సార్లు అనుకూల ఫలితాలు వచ్చినా.. కొన్నిసార్లు మూల్యం చెల్లించుకోవాలి. ఇప్పుడు కోహ్లీ.. బంగ్లా వికెట్ కీపర్ రహీంని స్లెడ్జింగ్ చేస్తాడని చెప్పడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
వరల్డ్ కప్ లో భాగంగా నేడు పూణే వేదికగా భారత్-బాంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ రెండు జట్ల మధ్య వార్ అంటే వివాదాలు, విమర్శలు సహజమే. ఈ సందర్భంగా బంగ్లా వికెట్ కీపర్ మాట్లాడుతూ.."నేను అతనితో ఆడినప్పుడల్లా ముఖ్యంగా బ్యాటింగ్‌కి వెళ్ళిన ప్రతిసారీ అతను నన్ను స్లెడ్జింగ్ చేయడానికి ప్రయత్నిస్తాడు. ఎందుకంటే కోహ్లీ పోటీతత్వం గల వ్యక్తి. అతను ఎప్పుడు గెలవాలని కోరుకుంటాడు. నేను విరాట్‌ను ఎప్పుడూ స్లెడ్జ్ చేయను, అతను ప్రేరణ పొందుతాడు. ప్రపంచంలోని కొంతమంది బ్యాటర్లు స్లెడ్జ్ చేయడానికి ఇష్టపడతారు. వీలైనంత త్వరగా అతడిని వదిలించుకోవాలని నా బౌలర్లకు నేను ఎప్పుడూ చెబుతుంటాను" అని రహీం చెప్పుకొచ్చాడు.
ALSO READ:- ఆ విషయంలో భారత్‌ని భయపెడుతున్న బంగ్లాదేశ్
ముష్ఫికర్ రహీమ్ మైదానంలో ఓవరాక్షన్ చేస్తాడనే పేరుంది. ఎప్పుడూ అత్యుత్సాహం ప్రదర్శిస్తూ విమర్శలను మూటకట్టుకుంటాడు. అలాంటి ఒక వ్యక్తి కోహ్లీ లాంటి జెంటిల్ మెన్ పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదనే అభిప్రాయలు వినిపిస్తున్నాయి. మరి రహీం చేసిన వ్యాఖ్యలంకు కోహ్లీ ఎలా స్పందిస్తాడో చూడాలి.