
పాకిస్థాన్ వేదికగా ఫిబ్రవరి 19 నుంచి జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీకి మరో 10 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ మెగా టోర్నీ ఫిబ్రవరి 19 నుండి మార్చి 9 వరకు.. అంటే 19 రోజుల పాటు అభిమానులను అలరించనుంది. ఫిబ్రవరి 19న కరాచీ వేదికగా ఆతిథ్య పాకిస్థాన్ జట్టు.. ప్రారంభ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఆతిధ్య దేశం పాకిస్థాన్ తో పాటు భారత్ ఈ టోర్నీలో టైటిల్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతున్నాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి.
ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ మాత్రం అండర్ డాగ్ గా బరిలోకి దిగుతున్నాయి. అయితే బంగ్లాదేశ్ వెటరన్ క్రికెటర్ ముష్ఫికర్ రహీమ్ తమ జట్టును తక్కువగా అంచనా వేస్తే మూల్యం చెలించుకోవాల్సిందే అని చెబుతున్నాడు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఆడుతుందని జోస్యం చెప్పాడు. అంతేకాదు భారత్ ఫైనల్ కు వస్తుందని.. బంగ్లాదేశ్ టీమిండియాను ఓడిస్తుందని బంగ్లా వెటరన్ కాన్ఫిడెంట్ గా చెప్పాడు.
ALSO READ | IND vs ENG: రిటైర్ అవ్వాల్సిన స్టేజ్‌లో వన్డే అరంగేట్రం.. అరుదైన లిస్టులో టీమిండియా స్పిన్నర్
ఈ టోర్నీలో భారత జట్టు.. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో తమ మొదటి మ్యాచ్ ఆడుతుంది. స్వదేశంలో జరగనుండడంతో పాకిస్థాన్ ఈ టోర్నీలో టైటిల్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. భారత్, ఆస్ట్రేలియా జట్లు కూడా టైటిల్ రేస్ లో ఉన్నాయి. హైబ్రిడ్ మోడల్‌లో జరగనున్న ఈ టోర్నీకి పాకిస్థాన్‌తోపాటు దుబాయ్ ఆతిథ్యం ఇవ్వనుంది. భారత జట్టు ఆడే మ్యాచ్‌లు దుబాయిలో జరగనుండగా.. మిలిగిన జట్లు తలపడే మ్యాచ్‌లు పాకిస్థాన్‌లో జరగనున్నాయి.