ముంబై: అండర్19 వరల్డ్ కప్ స్టార్ ముషీర్ ఖాన్ (203 నాటౌట్) అజేయ డబుల్ సెంచరీతో చెలరేగడంతో బరోడాతో రంజీ ట్రోఫీ క్వార్టర్స్‌లో ముంబై తొలి ఇన్నింగ్స్‌లో మంచి స్కోరు చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 248/5తో రెండో రోజు, శనివారం ఆట కొనసాగించిన ముంబై 384 రన్స్‌కు ఆలౌటైంది. ముషీర్ డబుల్ సెంచరీ పూర్తి చేసుకోగా.. హార్తిక్ తమోరె (57) ఫిఫ్టీతో రాణించాడు.
బరోడా బౌలర్లలో భార్గవ్ భట్ ఏడు వికెట్లు పడగొట్టాడు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన బరోడా 127/2 స్కోరుతో రెండో రోజు ముగించింది. ఇక, ఆంధ్ర టీమ్‌తో క్వార్టర్ ఫైనల్లో మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 234 రన్స్‌కు ఆలౌటైంది. ప్రతిగా ఆంధ్ర 68.3 ఓవర్లలో 172 రన్స్‌కే కుప్పకూలింది. తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఎంపీ రెండో రోజు చివరకు 21/0 స్కోరుతో నిలిచింది.