- ముంబై రెండో ఇన్నింగ్స్ 418 ఆలౌట్
- విదర్భ ముంగిట 538 రన్స్ టార్గెట్
ముంబై : రంజీ ట్రోఫీ ఫైనల్లో ముంబై గెలుపు దిశగా సాగుతోంది. ముషీర్ ఖాన్ (136) సెంచరీకి తోడు శ్రేయస్ అయ్యర్ (95) కూడా దంచికొట్టడంతో.. విదర్భ ముందు 538 రన్స్ టార్గెట్‌ను ఉంచింది. దీన్ని ఛేదించేందుకు మంగళవారం మూడో రోజు బరిలోకి దిగిన విదర్భ ఆట ముగిసే టైమ్‌కు రెండో ఇన్నింగ్స్‌లో 2 ఓవర్లలో 10/0 స్కోరు చేసింది. అథర్వ (3 బ్యాటింగ్), ధ్రువ్ షోరె (7 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. చేతిలో 10 వికెట్లు ఉండగా, మరో రెండు రోజుల ఆట మిగిలి ఉంది. అంతకుముందు 141/2 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన ముంబై రెండో ఇన్నింగ్స్‌లో 130.2 ఓవర్లలో 418 రన్స్‌కు ఆలౌటైంది.
ఓవర్‌నైట్ బ్యాటర్ ముషీర్ మరో సెంచరీతో చెలరేగాడు. కెప్టెన్ అజింక్యా రహానె (73) మూడో వికెట్‌కు 130 రన్స్ జత చేసిన అతను శ్రేయస్‌తో నాలుగో వికెట్‌కు 168 రన్స్ జోడించాడు. చివర్లో శామ్స్ ములానీ (50) హాఫ్ సెంచరీ సాధించడంతో ముంబై భారీ టార్గెట్‌ను నిర్దేశించింది. విదర్భ బౌలర్లలో హర్ష్ దూబే 5, యష్ ఠాకూర్ 3 వికెట్లు తీశారు.
సచిన్ రికార్డు బ్రేక్ చేసిన ముషీర్
రంజీ ట్రోఫీ ఫైనల్లో సెంచరీ చేసిన యంగెస్ట్ ప్లేయర్‌గా ముంబై బ్యాటర్, 19 ఏండ్ల ముషీర్ ఖాన్ క్రికెట్ లెజెండ్ సచిన్ రికార్డును బ్రేక్ చేశాడు. 21 ఏండ్ల వయసులో సచిన్ 1994–95 ఫైనల్లో ఇదే వాంఖడేలో పంజాబ్‌పై 140 రన్స్ చేశాడు. 29 ఏండ్లుగా చెక్కుచెదరకుండా ఉన్న ఈ రికార్డును సచిన్ సమక్షంలోనే ముషీర్ బ్రేక్ చేశాడు. మూడో రోజు ఆటను సచిన్ గ్యాలరీ నుంచి చూశాడు.