పుట్టగొడుగులూ మనుషుల్లెక్కనే మాట్లాడుకుంటాయట!

చెట్లలో జీవం ఉంటుందని, అవి ఒక దానితో ఒకటి మాట్లాడుకుంటాయని సైన్స్ పుస్తకాల్లో చదువుకునే ఉంటాం. కానీ ఫంగీ (పుట్టగొడుగులు) కూడా పరస్పరం మాట్లాడుకుంటాయని తెలుసా? ఇవి మాట్లాడుకునే ప్రాసెస్ కూడా మనుషుల లెక్కనే ఉంటుందట! ఈ విషయాన్ని లేటెస్ట్‌గా శాస్త్రవేత్తలు గుర్తించారు. నాలుగు రకాల జాతులకు చెందిన ఫంగీల (పుట్టగొడుగులు)పై చేసిన అధ్యయనంలో ఎలక్ట్రికల్ యాక్టివిటీ ద్వారా కమ్యూనికేషన్‌ జరుగుతున్నట్లు యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్ ఇంగ్లాండ్‌ పరిశోధకులు తేల్చారు. మనుషులు మాట్లాడుకున్నట్లుగానే వీటి కమ్యూనికేషన్ వ్యవస్థ ఉందని సైంటిస్టులు చెబుతున్నారు.

మనం పదాలు, మాటల ద్వారా మాట్లాడునే తీరుగానే అవి కూడా ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ద్వారా 50 పదాల వరకూ జనరేట్ చేసి మాట్లాడుకుంటాయని రీసెర్చ్‌లో తేలిందన్నారు. ఫుడ్ గురించి లేదా ఏదైనా హాని ఎదురైనప్పుడు ఆ సమాచారాన్ని ఎలక్ట్రిక్ సిగ్నల్స్‌ రూపంలో, వేర్ల ద్వారా మిగతా వాటికి తెలియజేస్తాయని గుర్తించామని ప్రొఫెసర్ ఆండ్రూ అడమాటజ్కీ తెలిపారు. ఎనోకీ, స్ప్లిట్ గిల్, ఘోస్ట్ ఫంగై, కాటర్‌‌పిల్లర్ ఫంగై లాంటి జాతుల్లో ఈ ప్రక్రియను గుర్తించామన్నారు. ఇవి జనరేట్ చేసే సిగ్నల్స్‌ను లాబొరేటర్ అనాలసిస్‌ చేసినట్లు తెలిపారు. పుట్టగొడుగులు సిగ్నల్స్‌ ద్వారా జనరేట్ చేసే పదాల్లో ఇంగ్లిష్ భాషతో పోల్చి చూస్తే సగటున 4.8 నుంచి 5.97 అక్షరాల వరకూ ఉంటాయని ఆండ్రూ పేర్కొన్నారు. ఈ పదాల సైజు కూడా మనుషులు వాడే పదాలకు దగ్గరగా ఉందన్నారు. కాగా, స్టడీ రిపోర్ట్ రాయల్ సొసైటీ సైన్స్ జర్నల్‌లో పబ్లిష్​ అయింది.

మరిన్ని వార్తల కోసం..

పోలీసులపై మరో ఎంఐఎం కార్పొరేటర్ దౌర్జన్యం

ఎండలు, వడగాలులపై తెలుగు రాష్ట్రాలకు హెచ్చరికలు

ప్రధాని మోడీకి శ్రీలంక క్రికెటర్ థ్యాంక్స్