- ఇందులో ప్రభుత్వ ఖర్చు 1,763 కోట్లు.. మిగతాది ఆర్థిక సాయం
- 2030 డిసెంబర్ 30 నాటికి పూర్తి చేయాలని టార్గెట్
హైదరాబాద్, వెలుగు: మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టును నాలుగు ప్రధాన భాగాలుగా చేపట్టనున్నట్టు ప్రిలిమినరీ రిపోర్టులో మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్‌కార్పొరేషన్ పేర్కొంది. ఐదేండ్లలో రూ.5,863 కోట్లతో ప్రాజెక్టును చేపట్టనున్నట్టు తెలిపింది. అందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.1,763 కోట్లు కాగా.. బయటి నుంచి రూ.4,100 కోట్ల ఆర్థిక సాయం పొందుతామని చెప్పింది. 2030 డిసెంబర్30 నాటికి ప్రాజెక్టును పూర్తి చేసేలా టార్గెట్ పెట్టుకున్నట్టు పేర్కొంది. మొదటి యాక్టివిటీలో భాగంగా నదీ జలాల శుద్ధితో పాటు నీటి నిర్వహణ, వరదల నియంత్రణ వ్యవస్థ, వర్షపు నీటి నిర్వహణను చేపట్టనున్నారు.
రెండో యాక్టివిటీగా ల్యాండ్‌స్కేప్‌ను అభివృద్ధి చేసి నది సహజసిద్ధమైన లక్షణాన్ని రీస్టోర్ చేయనున్నారు. మూడో యాక్టివిటీలో భాగంగా రివర్ కారిడార్‌లో ట్రాన్స్పోర్ట్హబ్లను ఏర్పాటు చేసి రవాణా వ్యవస్థను మెరుగు పరుస్తారు. నాలుగో యాక్టివిటీలో భాగంగా పునరుజ్జీవ పథకం ద్వారా ఆదాయాన్నిచ్చే అంశాలపై దృష్టి సారించి కల్చరల్ రీసోర్సెస్‌ను గుర్తించనున్నారు. హైదరాబాద్ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకుంటూనే మూసీ నదిని శుద్ధి చేస్తామని రిపోర్ట్‌లో పేర్కొంది. టూరిజం డెవలప్ చేసేలా ఈస్ట్–వెస్ట్ కారిడార్నిర్మాణాన్ని చేపట్టనుంది. నదీ తీరాలను పటిష్ఠపరిచి వరద నియంత్రణ చర్యలు చేపట్టడం ద్వారా వరద ముప్పును తగ్గించనుంది. నదీ తీరంలో నివసిస్తున్న వారి ఉపాధిని మెరుగుపరచనుంది.
ఇన్వెస్టర్లను ఆకర్షించేలా..
రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేలా మూసీ చుట్టూ వివిధ ప్రాజెక్టులను డెవలప్చేయనున్నట్టు రిపోర్టులో కార్పొరేషన్ పేర్కొంది. పర్యావరణంపై ప్రభావాన్ని తగ్గించేందుకు చర్యలు చేపట్టనున్నట్టు తెలిపింది. రీసైకిల్ చేసిన వస్తువులతో పర్మియేబుల్పేవ్మెంట్ల నిర్మాణం, రెయిన్గార్డెన్స్వంటి వాటిని ఏర్పాటు చేయనున్నట్టు చెప్పింది. క్లైమేట్ చేంజ్‌ను దృష్టిలో పెట్టుకుని గ్రీన్రూఫ్లను ఏర్పాటు చేసి అర్బన్హీట్ఐలాండ్ఎఫెక్ట్ను తగ్గించనుంది. తద్వారా కాలుష్యాన్ని తగ్గించేందుకు కసరత్తు చేస్తున్నది. విపత్తులను తగ్గించేందుకు ఎలివేటెడ్స్ట్రక్చర్లు, ఫ్లడ్బారియర్లు వంటి వాటిని నిర్మించనుంది. వరద ముప్పును ముందే పసిగట్టేలా, వనరుల కేటాయింపు, ప్లానింగ్అండ్మెయింటెనెన్స్ను మరింత మెరుగుపరిచేందుకు స్మార్ట్టెక్నాలజీని మూసీ పొడవునా ఏర్పాటు చేయనుంది.
ప్రైవేట్ ఫండింగ్..
పబ్లిక్, ప్రైవేట్ పార్ట్నర్షిప్ద్వారా (పీపీపీ) టూరిజం, హాస్పిటాలిటీ, రియల్ ఎస్టేట్సెక్టార్స్తో పాటు సీఎస్ఆర్ఫండింగ్ద్వారా ప్రాజెక్టుకు ఫైనాన్స్ సమకూర్చనున్నట్టు రిపోర్ట్‌లో కార్పొరేషన్ పేర్కొంది. పర్యావరణ హితమైన కాంపొనెంట్ల ఏర్పాటుకు సంబంధించి గ్రీన్బాండ్లను జారీ చేయనున్నట్టు తెలిపింది. ప్రైవేటు కంపెనీల భాగస్వామ్యంతో ప్రాజెక్టులో కీలకమైన కాంపొనెంట్ల నిర్మాణం, ఇంజనీరింగ్, పర్యావరణ నిర్వహణ వంటి వాటికి సంబంధించి నైపుణ్యాలను అందిపుచ్చుకోవచ్చని చెప్పింది.