పీపీపీ మోడ్​లో మూసీ నది బ్యూటిఫికేషన్​

  • రివర్ ఫ్రంట్ కొత్త ప్రతిపాదనలు
  • ప్రాజెక్ట్ అభివృద్ధికి నిర్ణయం
  • 10 వేల కోట్లు అవసరమని అంచనా
  • ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా అనేది డౌటే

హైదరాబాద్, వెలుగు : మూసీ ప్రక్షాళన, బ్యూటిఫికేషన్ కోసం రివర్ ​ఫ్రంట్ ​అధికారులు కొత్త ప్రతిపాదనలు ప్రిపేర్​ చేశారు. ఈ ప్రాజెక్ట్ ను పీపీపీ ( పబ్లిక్​, ప్రైవేటు, పార్ట్​నర్​ షిప్​ ) మోడ్ లో చేపట్టాలని నిర్ణయించారు. మూసీ ప్రక్షాళన చేస్తామని ఏళ్లుగా  ప్రభుత్వం చెబుతూనే ఉంది. ఆ దిశగా చర్యలు తీసుకోవడంలో చిత్తశుద్ధితో పనిచేయడం లేదు.  బ్యూటిఫికేషన్​కోసం ఖర్చు చేస్తలేదు. బడ్జెట్​లో భారీగా కేటాయింపులు చూపుతుందే తప్ప పైసా ఇస్తలేదు. దీంతో మూసీలో మురికి ఎక్కడిదక్కడే ఉంటుంది. ఇక ప్రభుత్వ నిధులతో సాధ్యం కాదని, పీపీపీ మోడ్ లో అయితే ప్రాజెక్ట్ ముందుకెళ్తుందని అధికారులు క్లారిటీకి వచ్చారు. అందుకు అనుగుణంగా కొత్తగా ప్రతిపాదనలు తయారు చేశారు.

నిధులు లేక ఆగిపోతుండగా..

మూసీలో మురుగును తొలగించాలని దశాబ్దాలుగా హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, వాటర్ బోర్డు అధికారులు ఎవరికి వారే ప్లాన్​ చేస్తున్నా అమలు మాత్రం నిధులు లేక ఆగిపోతోంది. దీంతో ప్రైవేట్ సంస్థలను ఇన్ వాల్వ్ చేయాలని రివర్​ ఫ్రంట్​ అధికారులు ఆలోచించారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్ నర్ షిప్ (పీపీపీ) మోడ్ ను తెరపైకి తెచ్చారు. మూసీ ప్రవహించే 50 కిలో మీటర్ల పరిధిలోని పరివాహక ప్రాంతాలను బ్యూటిఫికేషన్ ​చేయాలని ప్లాన్​ చేశారు.  ఇందుకు నదిపై స్కై బ్రిడ్జిలు, టూరిస్ట్​ ఏరియాలను డెవలప్ చేసేలా ప్రపోజల్స్ ప్రిపేర్​ చేస్తున్నారు. మూసీ వెంట ఎస్టీపీలు, నది పరివాహక ప్రాంతంలోని కబ్జాల తొలగింపు, డ్రైనేజీ నీళ్ల మళ్లింపు, పూడిక తొలగింపు,  సైక్లింగ్ ట్రాకులను నిర్మాణం చేపట్టేలా రూపొందిస్తున్నారు.

రిస్క్​తో కూడిన పనే..

రివర్​ఫ్రంట్​ అధికారులు ప్రతిపాదిస్తున్న పీపీపీ ప్రాజెక్ట్ కు కనీసం రూ. 10 వేల కోట్లు అవసరమని అంచనా వేశారు. మూసీ వెంట కబ్జాలు పెరిగిపోయాయి. సిటీ మురుగంతా నదిలో కలుస్తోంది. ముందుగా వీటిని తొలగించాలి. ఆ తర్వాత బ్యూటిఫికేషన్ చేయాలి. ఇదంతా పెద్ద రిస్క్ తో కూడినది. భారీగా నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. పీపీపీ మోడ్ లోనైతే ప్రభుత్వంపై బర్డెన్ తగ్గుతుంది. ప్రైవేట్ సంస్థనే మొత్తం ప్రాజెక్ట్ ను కంప్లీట్​చేస్తుంది.   ప్రభుత్వం వాటా తక్కువగానే ఉంటుంది. మూసీ ప్రక్షాళనకు ఈ పద్ధతే బెటర్​అని రివర్​ఫ్రంట్​ అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్ట్ కు ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తుందా లేదా అనేది డౌట్ గా ఉంది.

ప్రైవేట్ కంపెనీలు ముందుకొచ్చేనా!

రివర్​ఫ్రంట్ అధికారులు పీపీపీ మోడల్ పేరుతో హడావుడి చేస్తున్నప్పటికీ ఈప్రాజెక్ట్ చేపట్టేందుకు ప్రైవేట్ కంపెనీలు ముందుకు వస్తాయా? అనే ప్రశ్న తలెత్తుతోంది. సాధారణంగా పీపీపీ మోడల్ లో వర్క్ చేయాలంటే ప్రాజెక్ట్ పూర్తైన తర్వాత దాని ద్వారా భారీగా ఆదాయం వచ్చే పరిస్థితి ఉంటేనే ప్రైవేట్ కంపెనీలు ఇంట్రెస్ట్​ చూపిస్తాయి. కానీ మూసీ ప్రాజెక్ట్ పూర్తైన తర్వాత ప్రైవేట్ కంపెనీకి ఇన్​కం వచ్చే సోర్స్ పెద్దగా ఏమీ ఉండదు. రివర్​చుట్టుపక్కల నిర్మించిన పార్క్ లు, బోటింగ్ ల ద్వారా వచ్చే ఆదాయం ఏ మాత్రం సరిపోదు. లాభం లేని ఈ ప్రాజెక్ట్ లో పనిచేసేందుకు ప్రైవేట్ సంస్థలు రావడం కష్టమే. ప్రస్తుతం మూసీ ప్రాజెక్ట్ అడుగు ముందుకు కదలకపోవడంతో డైవర్ట్ చేసేందుకే కొత్త ప్రతిపాదనలు తెరపైకి తెస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి..

నయిమ్ ప్రధాన అనుచరుడు ఎండి నాసర్ మృతి

వెదురు సాగుకు ఎదురుదెబ్బ..రాష్ట్ర వాటా చెల్లించని సర్కారు

మూడు నెలల సదువులకు ఏడాది ఫీజు కట్టాల్నట