చినుకు పడితే చాలు... హైదరాబాద్ నగరం అతలాకుతలమై పోతుంది. వారం రోజుల క్రితం కురిసిన వర్షాలకు రాజధాని రహదారులు ఏరులను తలపించాయి. రోడ్లన్నీ ద్వంసమయ్యాయి. వరద వీళ్లతో కాలనీలు నిండిపోయాయి. ఇండ్లు, అపార్ట్ మెంట్లలోకి కూడా నీళ్లు చొచ్చుకొని పచ్చాయి. నగర జీవితం అస్తవ్యస్తమైంది. కానీ సరిగ్గా 116 ఏండ్ల కిందట సరిగ్గా ఇదే రోజు (సెప్టెంబర్ 28) మూసీ నది మహోగ్రరూపంతో నగరంపై విరుచుకుపడి వేలాది మందిని బలి తీసుకున్నది. ప్రతి ఏడాది. ఆ విషాదాన్ని గుర్తు చేసుకుంటున్నా, వరదలు, భారీ వర్షాల కారణంగా నగర జీవితం ద్వంసం కాకుండా కాపాడే గట్టి చర్యలు మాత్రం ఏ ప్రభుత్వాలు చేపట్టడం లేదు.
నిజానికి ప్రజాస్వామిక ప్రభుత్వాల కంటే నిజాం రాజులే వాటి బీభత్సానికి తీవ్రంగా చలించారు. తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి నిలిపారు. 1908 సెప్టెంబర్ 28న మూసీ విలయం సంభవించింది. తర్వాత రెండేళ్లకే హైదరాబాద్ పై ప్లేగు మహమ్మారి దాడి చేసింది. తీవ్రమైన ప్రాణనష్టం జరిగింది. ఈ సంఘటన నిజాం రాజు మహబూబ్ అలీఖాన్ ను తీవ్రంగా కలిలివేసింది. ఈ కలత ఆయనను కుంగదీసింది. తర్వాత కాలంలో దీనిపై సరోజినినాయుడు 'టియర్స్ ఆఫ్ ఆసిఫ్' పేరుతో ఓ పోయెం కూడా.రాశారు.
ALSO READ | నిజాం పాలనలో నీటిపారుదల సౌకర్యాలు, వైద్య సదుపాయాలు
గంగమ్మను శాంతింపజేయాలన్న హిందువుల సెంటిమెంట్ ను గౌరవించి, మతప రంగా తనకు సంబంధం చేసేప్పటికీ మూసీనదికి బంగారు చేటతో ముత్యాలను సమర్పించిన వ్యక్తి నిజాం మహబూబ్ అలీఖాన్, వదరల చారి నుంచి ప్రజలను కాపాడేందుకు తీసుకోవాల్సిన చర్యలపై, సిటీ ఇంప్రూవ్ మెంట్ బోర్డును నిజాం ఏర్పాటు చేశారు. దానికి తన కుమారుడు మో ఆజము చైర్మన్ గా నియమించారు. సర్ మీర్జా ఇస్మాయిల్ అప్పట్లో పెద్ద ఇంజనీర్ వారు సండై దింపులు జరిపి మోక్షగుండం విశ్వేశ్వరయ్యము పిలిపించారు. అప్పట్లో నగర జనాభా 5 నుంచి 10 లక్షల లోపు మాత్రమే. కానీ వారికి కావాల్సిన అన్ని మౌలిక వసతులు సగరంలో ఉండేవి. అప్ప టికి నగరం నిండా వందల సంఖ్యలో చెరుపులు, కుంటలున్నాయి. వాటిలోకి వరద నీళ్లను చేర్చేం దుకు నాలాలున్నాయి.
వందేళ్లు దాటినా అదే డ్రైనేజీ వ్యవస్థను కొంచెం మార్పులు చేర్పులతో ఇంకా కొనసాగిస్తున్నారు. ఇప్పుడున్న జనాభాకు కనీసం 5 వేల కిలోమీటర్ల సీనరేజ్ లైన్స్ కావాల్సి ఉండగా కేవలం 1,500 కిలోమీటర్ల పరిధిలోనే ఉన్నాయి. కనీసం 5 లక్షల మ్యాన్ హోల్స్ అవసముండగా 2 లక్షలు మాత్రమే ఉన్నాయి. పైగా వందలాది చెరువులు, కుంటలు మాయమయ్యా యి. ఇప్పటికి చెరువులు కబ్దాలకు గురవుతూనే ఉన్నాయి. 14 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో నిర్మించిన హుస్సేన్ సాగర్ ప్రస్తుతం 5 చదరపు కిలోమీటర్లకు కుంచించుకుపోయింది. పరిస్థితి ఇలా ఉంచడంతో వర్షం వచ్చిన ప్రతిసారి ప్రజలు భయంభయంగానే బతకాల్సివస్తుంది.
మళ్లీ జరగకుండా నిజాం ప్రభువు ప్లాన్..
మూసీ వరదల తర్వాత ప్రళయాల్ని ఎదుర్కొనేల దుకుఅప్పటి నిజాం ప్రభువు మీర్ మహబాబ్ అలీ ఖాన్ దృష్టి పెట్టారు. అప్పటి ప్రసిద్ధ ఇంజనీర్ మో క్షగుండం విశ్వేశ్వరయ్యను పిలిపించి ప్లానింగ్ బాధ్యతలను అప్పగించారు. హైదరాబాద్ నగరంలోరెండు జలాశయాల నిర్మాణంతో పాటు మెరుగైనడ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని మోక్ష గుండం సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. 1911లో గద్దెనెక్కిన ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ హయాంలో మూసీ నదిపై 1920లో ఉస్మాన్ సాగర్, 1927లో హిమాయత్ సాగర్ ఏర్పాటైంది. నది చుట్టూ అసకట్టల్ని నిర్మించారు.
1908 సెప్టెంబర్ లో ఏం జరిగింది...
1908 సెప్టెంబర్ 26, 27 తేదీల్లో పడిన భారీ వర్షాలతో మొదట పాలమాకుల చెరువు గట్టు తెగింది. ఆ వరద నందుల కత్వ చెరువును చేరింది. ఆ చెరువు కూడా వరద తాకిడి తట్టుకోలేక పోయింది. గొలుసుకట్టులోని మరోనాలుగైదు చెరువులు కూడా గట్లు తెగాయి. నీళ్లు చందనవ ఖి డ్యాము ను చేరాయి. డ్యామ్ తెగి నీళ్లు ఫిరంగి నాలాను ముంచెత్తాయి. ఫిరంగి నాలా నుంచి ఈసా నదిని చేరాయి. ఈసా నది ఉప్పొంగి మూసీని చేరింది. మూసీ ఉగ్రరూపం దాల్చి హై దరాబాద్ చరిత్రలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
1908 సెప్టెంబర్ 27న ఉదయం 11 గంటలకు మూసీ నది నీటి మట్టం గరిష్ఠ స్థాయికి చేరింది. అంతకు రెండు రోజుల క్రితం తుంపరలుగా మొదలైన వర్షం భీకరంగా మారింది. ఆరోజు(1908 సెప్టెంబర్ 27) రాత్రి 15.38 సెంటీ మీటర్ల వర్షంతో సిటీ అతలాకుతలమైంది. పరీవాహక ప్రాంతంలో నీ చెరువులు నిండిపోయాయి శంషాబాద్ ఏరియాలో ఒక్కరోజే 12.05 సెంటీ మీటర్లు
వర్షం కురిసింది. మూసీ నది రెండు ఒడ్డులమధ్య దూరం 700 అడుగులే. కానీ వరదల సమయంలో కిలో మీటర్ కు మించిపోయింది. మూసీ నీళ్లు ఏరులై పారి అర్థరాత్రి జల విలయం సృష్టించాయి . ప్రస్తుతం ఉస్మానియా హాస్పిటల్ ఉన్న ప్రాంతంలో ఆనాడు 200 మంది గల్లంతయ్యారు. పేట్లబురుజు ప్రాంతంలో వంతెనల పైకి ఎక్కి ప్రాణాలు రక్షించుకునేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.. వంతెన గోడలు కూలి జనం కొట్టుకుపోయారు. ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీసిన కొందరు రాజభవనాల్లో తలదాచుకున్నారు.
మూసి నది వరదలు మనుషుల ప్రాణాలు, ఆస్తులతో పాటు చారిత్రక ప్రాధాన్యత కలిగిన వారసత్వ సంపదను దెబ్బతీశాయి. 1908 సెప్టెంబర్ 26న హైదరాబాద్ లో కురిసిన కుంభవృష్టితో మూసీనది మరింత పోటెత్తింది. భారీగా వరద నీరు చేరి లోతట్టు ప్రాంతాల్ని ముంచెత్తుంది. వరదల్లో చిక్కుకుని వేలాది మంది జల సమాధి అయ్యారు. గోడలు, చెట్లు ఎక్కినా తప్పించుకోలేక పోయారు. వరదల ప్రభావానికి గోడలు,చెట్లు కూడా కూలిపోయి కొట్టుకుపోయారు.మూసీ నదికి ఉత్తరం వైపున ఉన్న ఉద్యానవనంలోని ఓ భారీ చింతచెట్టుపైకి ఎక్కిన 150 మంది.ప్రాణాలు కాపాడుకోగలిగారు. అనంతర కాలంలో ఆ ప్రాంతంలో ఉస్మానియా హాస్పిటల్ నిర్మించారు. అప్పుడు కేవలం 48 గంటల్లో 15 వేల నుంది మరణించారు. 50 వేల ఇళ్లు నీట మునిగాయి. 20 వేల ఇళ్లు కూలిపోయాయి. 80 వేల మంది నిరాశ్రయులయ్యారు.