హైదరాబాద్ సిటీ, వెలుగు: మూసీ రివర్బెడ్నిర్వాసితులు ప్రభుత్వం అందజేస్తున్న డబుల్ బెడ్రూమ్ఇండ్లలోకి తరలి వెళ్తున్నారు. గురు, శుక్రవారాల్లో మొత్తం 47 కుటుంబాలను అధికారులు తరలించారు. గురువారం సైదాబాద్ మండలం నుంచి 15 కుటుంబాలు, శుక్రవారం 32 కుటుంబాలు డబుల్ ఇండ్లలోకి వెళ్లాయి.
13 కుటుంబాలను జియాగూడలోని ఇండ్లకు, 34 కుటుంబాలను ప్రతాప సింగారంలోని ఇండ్లకు తరలించారు. హైదరాబాద్ జిల్లాలో ఇప్పటివరకు 900కు పైగా ఇండ్లకు RB–X మార్కింగ్చేయగా,221 కుటుంబాలను డబుల్బెడ్రూమ్ఇండ్లలోకి పంపించినట్లు తెలిపారు.