ఆంధ్రప్రదేశ్‌లోని కడప అమీన్ పీర్ పెద్ద దర్గా ఉర్సు ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పవిత్ర గంధం మహోత్సవాన్ని దర్గా ప్రతినిధులు వైభవంగా నిర్వహించారు. గంధం వేడుకల్లో మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ పాల్గొన్నారు. దర్గా పీఠాధిపతి అరిఫులా హుస్సేని గంధాన్ని తీసుకుని వచ్చి దర్గాలో మాజర్ల దగ్గర ఉంచి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కరోనా నేపథ్యంలో పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తూ ఉర్సు ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.