
‘ఆర్ఎక్స్ 100’ మొదలు ఇటీవల విడుదలైన ‘గం గం గణేశ’ వరకూ పలు సూపర్ హిట్ సాంగ్స్‌తో పాటు వైవిధ్యమైన నేపథ్య సంగీతంతో ఆకట్టుకున్నాడు చేతన్ భరద్వాజ్. అతను సంగీతం అందించిన కొత్త చిత్రం ‘హరోం హర’. సుధీర్ బాబు హీరోగా జ్ఞాన సాగర్ ద్వారక దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 14న విడుదలవుతోంది. ఈ సందర్భంగా చేతన్ మాట్లాడుతూ ‘ఇంత హార్డ్ కోర్ యాక్షన్ డ్రివెన్ ఉన్న సినిమా చేయడం ఇదే ఫస్ట్ టైమ్.
నిజానికి ఇదే నా బలం. దాన్ని ఎక్స్‌ప్లోర్ చేసే అవకాశం దక్కింది. ఇందులో యాక్షన్‌తో పాటు కోర్ ఎమోషన్స్ ఉంటాయి. సౌండ్ పంచ్ ప్రేక్షకులకు మంచి థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. హరోం హర, ‘నారిని విడిచే’ అనే పాటలు కళ్యాణ్ చక్రవర్తి రాశారు. కనులెందుకో పాట వెంగీ రాశారు. భరద్వాజ పాత్రుడు, హర్ష చెరో పాట రాశారు. ఇక 1989 నాటి రెట్రో కల్చర్‌కు తగ్గట్టుగా సౌత్ ఇండియన్ నాటు కలర్‌ని, నేటి యూత్‌కు నచ్చేలా స్టైలిష్‌గా కంపోజ్ చేయడం ఛాలెంజింగ్‌గా అనిపించింది’ అని తెలిపాడు.