![సినిమా సక్సెస్ అయితే అందరికీ క్రెడిట్ ఇవ్వాలి.. ఒక్కరికే కాదంటున్న డీఎస్పీ..](https://static.v6velugu.com/uploads/2025/02/music-director-devi-sri-prasad-about-thandel-movie-success-creditjpg1_MVt4wf1H5a.jpg)
టాలీవుడ్ స్టార్ హీరో అక్కనేని నాగచైతన్య, సాయి పల్లవి కలసి నటించిన తండేల్ శుక్రవారం వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. రియల్ లైఫ్ & లవ్ స్టోరీ జోనర్ లో తెరకెక్కిన ఈ సినిమాకి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. దీంతో చిత్ర యూనిట్ సంబరాలు చేసుకుంటున్నారు. అయితే తండేల్ సినిమా సక్సెస్ సందర్భంగా ఈ సినిమాకి మ్యూజిక్ అందించిన స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఇందులో భాగంగా తండేల్ సినిమా చుసిన చాలామంది సాంగ్స్, బీజియం స్కోర్ బాగుందంటూ మెసేజెస్ చేస్తూ అభినందిస్తున్నారని చాల సంతోషంగా ఉందని అన్నాడు. ఇక ఈ చిత్రం కోసం అందరూ సమిష్టిగా కలసి పని చెయ్యడంవల్లే మంచి రిజల్ట్ వచ్చిందని అలాగే సినిమా సక్సెస్ సినిమా సక్సెస్ అయితే అందరికీ క్రెడిట్ ఇవ్వాలి.. ఒక్కరికే కాదని అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇక గీతా ఆర్ట్స్, ప్రొడ్యూసర్స్ అల్లు అరవింద్, బన్నీ వాసు తదితరులతో మంచి సాన్నిహిత్యం ఉందని అందుకే ఎటువంటి ప్రెజర్ లేకుండా పని చేసానని చెప్పుకొచ్చాడు. అయితే ఈ వాఖ్యలని కొందరు వక్రీకరిస్తూ ట్రోల్ చేస్తున్నారు. గతంలో డీఎస్పీ పని చేసిన ఓ సినిమాకి ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ తో క్లాష్ వచ్చిందని అందుకే సినిమా పెద్ద హిట్ అయినప్పటికీ దేవిశ్రీ ప్రసాద్ కి మాత్రం కనీసం థాంక్స్ కూడా చెప్పకుండా ఆ హీరో క్రెడిట్ మొత్తం కొట్టేశాడని కామెంట్లు చేస్తున్నారు.
ALSO READ | డైరెక్టర్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న సీనియర్ డైరెక్టర్ కొడుకు.. ఎవరంటే..?
ఈ విషయం ఇలా ఉండగా దేవిశ్రీ ప్రసాద్ ఆమధ్య కొన్నేళ్లు వ్యక్తిగత కారణాలతో కొంత గ్యాప్ తీసుకున్నాడు. కానీ పుష్ప 2: ది రూల్, తండేల్ సినిమాలతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు. ప్రస్తుతం ధనుష్ హీరోగా నటిస్తున్న కుబేర, పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్, వృషభ తదితర సినిమాలకి మ్యూజిక్ అందిస్తున్నాడు.