Devi Sri Prasad: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్..ఎందుకంటే?

Devi Sri Prasad: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్..ఎందుకంటే?

టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) ఇవాళ బుధవారం (అక్టోబర్ 16న) తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి నివాసంలో ఆయన్ను మర్యా దపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ఈ నెల అక్టోబర్ 19న హైదరాబాద్ గచ్చి బౌలి స్టేడియంలో నిర్వహించనున్న మ్యూజికల్ ఈవెంట్ కు రావాలని ఆహ్వానించారు. దేవీశ్రీ ప్రసాద్ వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ప్రముఖ సినీ నిర్మాత, కాంగ్రెస్ నేత బండ్ల గణేశ్ ఉన్నారు. 

ALSO READ | Akhanda2: కాదని దాన్ని తాకితే జరిగేది తాండవమే.. అఖండ2లోని డైలాగ్‌తో గర్జించిన బాలకృష్ణ

అయితే.. దేశవ్యాప్తంగా లైవ్ షోస్ చేస్తానని వెల్లడించిన దేవిశ్రీప్రసాద్.. దానిని ముందుగా హైదరాబాద్ నుంచి మొదలు పెడుతున్నానని వెల్లడించారు. ఇప్పటికే ఈ ఈవెంట్కి మెగాస్టార్ చిరంజీవిని ఆయన నివాసానికి వెళ్లి దేవిశ్రీప్రసాద్ ఆహ్వానించారు. ఇకపోతే దీనికి సంబంధించిన టికెట్లు ఇప్పటికే నిర్వాహకులు విక్రయించారు.

దేవి శ్రీ ప్రసాద్ విషయానికి వస్తే::

రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్.. ఈ పేరు వింటేనే థియేటర్స్ అన్నీ ఊగిపోతాయి. తన ఎలక్ట్రిఫైయింగ్ మ్యూజిక్ తో సినిమాను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లడం మనోడి స్టైల్. సినిమా ఏదైనా, హీరో ఎవరైనా, భాష ఏదైనా తను అందించే మ్యూజిక్ లో మాత్రం తేడా ఉండదు. చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా పోస్టర్ పై దేవి పేరుందంటే మ్యూజికల్ హిట్ అవ్వాల్సిందే. అంతలా తన మ్యూజిక్ తో ఆడియన్స్ ను ఆకట్టుకున్నాడు దేవి శ్రీ ప్రసాద్.

అంతేకాదు ప్రస్తుతం సౌత్ లో టాప్ అండ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా కోనసాగుతున్న దేవి చేతిలో సౌత్ టాప్ స్టార్ హీరోల క్రేజీ సినిమాలున్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్, పుష్ప2, తండేల్, కుబేర, కంగువా, గుడ్ బ్యాడ్ అగ్లీ వంటి భాషతో సంబంధం లేకుండా వరుసగా క్రేజీ సినిమాలతో దూసుకుపోతోన్నాడు.