ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ గోపీసుందర్ తల్లి లివి సురేష్ బాబు (65) కన్నుమూశారు. తాజాగా ఈ విషయాన్ని స్వయంగా సంగీత దర్శకుడు గోపి సుందర్ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. తన తల్లితో దిగిన ఫోటోను షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యారు.
అయితే, కేరళలోని కూర్కెంచెరిలోని అజంతా అపార్ట్మెంట్లో ఆమె అనారోగ్యంతో చనిపోయారు. ఆమె అంత్యక్రియలు గురువారం (జనవరి 30న) మధ్యాహ్నం 3 గంటలకు వడూకర శ్మశానవాటికలో జరగనున్నాయి.
గోపి సుందర్ తన తల్లితో ఉన్న అనుబంధాన్ని తన సంగీత స్వరాలతో చెబుతూ ఎమోషనల్ అయ్యారు. "అమ్మా, నువ్వు నాకు జీవితాన్ని, ప్రేమను, నా కలలను అనుసరించే శక్తిని ఇచ్చావు. నేను సృష్టించే ప్రతి సంగీత స్వరం నువ్వు నాలో కురిపించిన ప్రేమను కలిగి ఉంటుంది. నువ్వు వెళ్ళిపోలేదు, నా హృదయంలో, నా శ్రావ్యతలో, నేను వేసే ప్రతి అడుగులో నువ్వు జీవిస్తున్నావు. మీ ఆత్మకు శాంతి కలగాలని నేను భగవంతుడిని ప్రార్థిస్తున్నాను" అంటూ గోపి సుందర్ భావోద్వేగం అయ్యారు.
Also Read : వియత్నాంలో వరుణ్ తేజ్.. ఎందుకంటే?
తెలుగు, తమిళ్, హిందీ, మలయాళ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు గోపీసుందర్. ఆయన తన తల్లిని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టడంతో సినీ ప్రముఖులతో పాటు ఆయన ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
గోపి సుందర్ తెలుగు సినిమాలు:
గోపి సుందర్ తెలుగులో తన బ్యూటిఫుల్ మెలోడీ ట్యూన్స్ తో మంచి సూపర్ హిట్ సినిమాలు అందించాడు. నాని హీరోగా వచ్చిన ‘భలే భలే మగాడివోయ్’, 'మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, గీతగోవిందం, మజ్ను, వరల్డ్ ఫేమస్ లవర్, ఎంత మంచివాడవురా, ఊపిరి, నిన్ను కోరి, శైలజారెడ్డి అల్లుడు, బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్ వంటి హిట్ సినిమాలకు సంగీత అందించి తెలుగులో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గా రాణిస్తున్నాడు.